ఆన్‌లైన్ క్లాస్‌లతో సైడ్‌ ఎఫెక్ట్స్.. ఫిర్యాదులు చేస్తోన్న తల్లిదండ్రులు

కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. అయితే కొందరికి ఫోన్లు లేకపోవడం, మరికొందరికి నెట్‌వర్క్ ప్రాబ్లమ్ వంటి సమస్యలు ఉంటున్నాయి. అయినా అష్టకష్టాలు పడుతూ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లను వింటున్నారు. అయితే ఈ క్లాస్‌ల వలన సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, వీటి వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల చూపు మందగిస్తుందంటూ వారు చెబుతున్నారు. […]

ఆన్‌లైన్ క్లాస్‌లతో సైడ్‌ ఎఫెక్ట్స్.. ఫిర్యాదులు చేస్తోన్న తల్లిదండ్రులు
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 6:25 PM

కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. అయితే కొందరికి ఫోన్లు లేకపోవడం, మరికొందరికి నెట్‌వర్క్ ప్రాబ్లమ్ వంటి సమస్యలు ఉంటున్నాయి. అయినా అష్టకష్టాలు పడుతూ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లను వింటున్నారు. అయితే ఈ క్లాస్‌ల వలన సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, వీటి వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల చూపు మందగిస్తుందంటూ వారు చెబుతున్నారు.

సాధారణంగానే ఎలాంటి విరామం లేకుండా ఒక గంట పాటు ఫోన్‌ లేదా లాప్‌టాప్ వంటికి చూడటం వలన తలనొప్పి రావడం, కళ్లు మంటలు అవ్వడం లాంటి లక్షణాలను మనం చూస్తునే ఉంటాం. చిన్న పిల్లలే కాదు పెద్దవారికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దానికి తోడు రేడియేషన్ కూడా మనపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటారు. అయితే ఆన్‌లైన్ క్లాస్‌ల పేరిటి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు ఫోన్‌ని చూస్తున్నారు(విద్యాసంస్థలు వారికి కేటాయించే సమయాన్ని బట్టి). దీని వలన పిల్లల్లో కంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు ఫిర్యాదులు చేస్తోన్న తల్లిదండ్రులు.. ప్రత్యామ్నాయంగా మరో మార్గం వెతకాలని కోరుతున్నారు. లేకపోతే కొన్ని వీడియోలను వాట్సాప్ చేయండని, దాని వలన రేడియేషన్ ఇబ్బందులు కాస్త తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అలా వీడియోలు పంపేందుకు టీచర్లు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే అందులో ఏదైనా తప్పులుంటే, అవి వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని వలన సంస్థకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సమస్యలకు చెక్ ఎలా పడుతుంది..? సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Read This Story Also: ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా.

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు