Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

లిఫ్ట్‌ ప్లీజ్‌ అంటూ నిలువుదోపిడీ..ముఠా అరెస్ట్‌ !

Robbery Gang Arrested, లిఫ్ట్‌ ప్లీజ్‌ అంటూ నిలువుదోపిడీ..ముఠా అరెస్ట్‌ !

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. దొంగతనాలే పనిగా పెట్టుకున్న కొందరు కేటుగాళ్లు.. లూటీలు చేసేందుకు సరికొత్త రూట్‌ సెలెక్ట్‌ చేసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులే టార్గెట్‌గా ఓ ముఠా దోపిడీలకు పాల్పడుతోంది. పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తూ.. వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
జిల్లాలోని బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, ఓ అజ్ఞాత వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు..తీరా అతడికి లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి కొద్ది దూరం వెళ్లగానే మరికొంత మంది తనను ఆపి తన వద్ద గల డబ్బు, విలువైన వస్తువులను దోచుకెళ్లారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు తనిఖీల్లో భాగంగా నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో కొంత మంది యువకులు అనుమానస్పదంగా కనిపించిన ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కూపీ లాగిన పోలీసులు అసలు బండారం బయటపెట్టారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అఖిల్‌ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్‌ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ముఠా సభ్యుల్లో ఒకరు దారిపై ఒంటరిగా బైక్ వెళ్లే వారిని లిఫ్ట్ అడిగే వారని, వారి వెనకాలే మిగితా వారంతా ఓ ఆటోలోఫాలో అయ్యేవారు. కొంత దూరం వెళ్లగానే వెనకాల కూర్చున్న వ్యక్తి బైక్ పక్కకు ఆపమని చెప్పేవాడు. ఆ వెంటనే మిగతా ముఠా వచ్చి ఆ వ్యక్తిని బెదిరించి డబ్బులు, బంగారం, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిపోయేవారని పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్‌ ఫోన్, రూ.1,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.