నటి దీపికా పదుకొనే జేఎన్‌యూకు అందుకే వెళ్లిందా..!

బాలీవుడ్ ప‌్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనేపై రిసెర్చ్ అండ్ ఎనాల‌సిస్ వింగ్ ‘రా’ మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అనీల్ ముసార‌త్ సూచనల మేరకే దీపికా.. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారని ఆయన వ్యాఖ్యానించారు.

నటి దీపికా పదుకొనే జేఎన్‌యూకు అందుకే వెళ్లిందా..!
Follow us

|

Updated on: Jul 30, 2020 | 3:32 AM

బాలీవుడ్ ప‌్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనేపై రిసెర్చ్ అండ్ ఎనాల‌సిస్ వింగ్ ‘రా’ మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి అనీల్ ముసార‌త్ సూచనల మేరకే దీపికా.. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది జ‌న‌వ‌రిలో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జేఎన్‌యూలో ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారని చెప్పారు. అందుకుగాను ముసారత్ తరుపున దీపికా ప‌దుకొనే రూ.5 కోట్లు ఆర్థిక సాయం కూడా చేశారని ఆరోపించారు. అనీల్ ముసార‌త్‌కు పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ఎన్ కే సూద్ తెలిపారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి మొద‌టి వారంలో మోదీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీలో విద్యార్థులు పెద్దఏత్తున ఆందోళను కొనసాగించారు. ఈ సంద‌ర్భంగా ముఖాల‌కు ముసుగులు ధ‌రించి వెళ్లిన కొంద‌రు దుండ‌గులు విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో దాదాపు 30 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఆ సంద‌ర్భంలో దీపికా ప‌దుకొనే జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా సొమ్మును కూడా అందించినట్లు ఎన్ కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి దుమారం రాజుకుంది. పాకిస్తాన్ చెందిన వ్యక్తులతో బాలీవుడ్ కు సంబంధాలు ఉన్నాయని మరోసారి స్పష్టమైందన్నార సూద్.