మొన్న ఈటెల.. నేడు నాయిని.. అసలేం జరుగుతోంది..?

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పారని.. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే.. టికెట్ ఇవ్వలేదని అన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ను గెలుపించుకుని రమ్మన్నారని.. ముఠా గోపాల్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారన్నారు. అంతేకాదు తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. నాయినికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇస్తారంటున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను […]

మొన్న ఈటెల.. నేడు నాయిని.. అసలేం జరుగుతోంది..?
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 3:05 PM

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పారని.. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే.. టికెట్ ఇవ్వలేదని అన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ను గెలుపించుకుని రమ్మన్నారని.. ముఠా గోపాల్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారన్నారు. అంతేకాదు తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. నాయినికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇస్తారంటున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను హోంమంత్రిగా చేశానని.. ఆ చైర్మన్ పదవి ఎవరికి కావాలంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో నేను కూడా ఓనర్‌నే అని అన్న ఆయన.. కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్, రసమయి కూడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవి అలానే ఉండటం.. హరీశ్ రావుకు కూడా మంత్రి పదవి రావడంతో పార్టీలో అనిశ్చితి తొలగిపోయిందనుకున్న తరుణంలో ఇప్పుడు నాయిని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.