Shanmukh Jaswanth: కొత్త లగ్జరీ కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Shanmukh Jaswanth New Car: షణ్ముఖ్ జస్వంత్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న పేరు. షణ్ముఖ్ ఏ వీడియో షేర్ చేసిన.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

Shanmukh Jaswanth: కొత్త లగ్జరీ కారు కొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Shanmukh

Edited By:

Updated on: Jul 16, 2021 | 3:20 PM

Shanmukh Jaswanth New Car: షణ్ముఖ్ జస్వంత్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న పేరు. షణ్ముఖ్ ఏ వీడియో షేర్ చేసిన.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక ఇతనికి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో, సీరిస్‏లతో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక సాప్ట్‏వేర్ డెవలపర్ సీరిస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల వచ్చిన సూర్య సీరిస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం షణ్ముక్ సూర్య సీరిస్ సక్సెస్ మూడ్‏లో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా షణ్ముఖ్ ఒక లగ్జరీ కారును కొన్నాడు. దీని ధర దాదాపు రూ.15 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కొత్త కారుతో కలిసి దిగిన ఫోటోలను షణ్ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై.. త్వరలోనే కొత్త డ్రైవర్ ను పెట్టుకుంటాను హై..  అంటూ తన స్టైల్లో సెటైర్ వేశాడు షణ్ముఖ్. అయితే కొత్త కారుతో ఫోటోలను దిగిన సమయంలో వెనక ఉన్న నంబర్ ప్లేట్‏ను బ్లర్ చేసి పోస్ట్ చేశాడు. ఇంకేముంది నెటిజన్స్ ఊరుకుంటారా.. నంబర్ ప్లేట్ బ్లర్ చేయడంపై షణ్ముఖ్ పై సెటైర్లు వేస్తున్నారు.

గతంలో షణ్ముఖ్.. మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఇమేజ్ డ్యామేజ్ అయింది. కొన్ని రోజులు షణ్ముఖ్‌ను అందరూ ఆడుకున్నారు. ఇక ఆ తర్వాత సూర్య వెబ్ సిరీస్ క్లిక్ అయ్యాడు. తాజాగా షణ్ముఖ్ కారు కొనడం. నంబర్ ప్లేట్ బ్లర్ చేయడంతో చలాన్లు కట్టాల్సి వస్తుందని ఇలా బ్లర్ చేస్తున్నావా ? ఈసారైనా మద్యం సేవించకుండా కారు నడుపు… జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Nidhhi Agerwal: మరీ చీప్‏గా ప్రవర్తించకండి.. నెటిజన్‏లపై ఇస్మార్ట్ బ్యూటీ ఫైర్..

Trisha: వీధుల్లో సైకిల్‌ సవారీ చేస్తోన్న చెన్నై చిన్నది.. సైక్లింగ్‌ వెనక ఉన్న సీక్రెంట్‌ ఏంటో చెప్పిన త్రిష.

Vijay Sethupathi: నాడు అన్నం కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసిన.. నేటి దక్షిణాది విలక్షణ నటుడు

Follow Us