
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా వేదికగా ఫోక్ సాంగ్స్ హవా విపరీతంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ పల్లె పాటలు ప్రపంచాన్ని చూట్టేస్తున్నాయి. ఎక్కడ ఏ ఇంట చిన్న దావత్ అయినా.. లేదా పబ్లిక్ ఈవెంట్స్ అయినా ఫోక్ సాంగ్ ఉండాల్సిందే. సామాన్యులే కాదు.. ఇప్పుడు ఈ పల్లె పాటలకు సినీతారలు సైతం కాలు కదుపుతున్నారు. అచ్చమైన తెలంగాణ భాషకు అర్థం తెలియకపోయినా ఆ మాస్ బీట్ కు మాత్రం స్టెప్పులేయాల్సిందే అన్నట్లుగా ఈ పాటలు సాగుతున్నాయి. పల్లె మట్టి వాసనలతో, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా వస్తున్న కొత్త ఫోక్ సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వరుసలోనే ఇటీవల యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న “ఎద్దులచే ముద్దు పెట్టె” (Yeddulache Mudduvette) జానపద గీతం ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 13 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ , వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ స్టేటస్‌లలో ఎక్కడ చూసినా ఈ పాటలోని మాస్ బీట్స్, ఫోక్ రైమింగ్ మారుమోగిపోతున్నాయి. జానపద ప్రియులు ఈ పాటను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ జానపద గీతానికి ప్రముఖ జానపద గాయని ప్రభ , నాగవ్వ వాయిస్ ప్రధాన బలం అని చెప్పాలి. అవును.. వీరిద్దరు తమదైన శైలిలో అద్భుతమైన గొంతును అందించగా, నాగవ్వ పాట సాహిత్యం, శైలిలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా, తెరపై వైష్ణవి సోనీ తన గ్రామీణ శైలి లుక్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్ , నటనతో అలరించారు. పాటలోని నాటు సంగీతం, గ్రామీణ జీవన విధానాన్ని , ప్రేమ భావాలను ప్రతిబింబించే సాహిత్యం వినే ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
సాధారణంగా గ్రామీణ జానపద పాటలకు ఉండే కనెక్టివిటీకి ఈ పాట నిదర్శనంగా నిలిచింది. పల్లెటూరి వాతావరణం, ఎద్దుల దొడ్డి, పావురాల గుట్టలు, పల్లెపడుచుల ముచ్చట్లతో కూడిన పల్లె పదాలు శ్రోతలను కట్టిపడేస్తున్నాయి. యువతతో పాటు అన్ని వర్గాల సినీ, పాటల అభిమానులు ఈ పాట మ్యూజిక్, డ్యాన్స్ మూమెంట్స్‌కు ఫిదా అవుతున్నారు. రోజురోజుకూ వ్యూస్ మరింత పెరుగుతుండటంతో ఈ పాట ‘ట్రెండింగ్ జానపద గీతాల’ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..