బాలయ్యకు విలన్‌ ఎవరంటే..చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ద్వారాక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాలగూడ రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలయ్యకు విలన్‌ ఎవరంటే..చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!

Edited By:

Updated on: Apr 12, 2020 | 9:34 AM

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ద్వారాక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాలగూడ రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో బాలకృష్ణ అఘోర పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పాత్రకు డైలాగ్‌లు ఉండవని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. ఈ మూవీలో బాలయ్య డబుల్‌ యాక్షన్‌లో కనిపించనున్నారని.. అందులో ఒకటి హీరో, మరొకటి విలన్‌ అని తెలుస్తోంది. హీరో, విలన్‌కు సంబంధించి అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను బోయపాటి రాసినట్లు సమాచారం. అంతేకాదు వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయని టాక్. కాగా అటు బాలకృష్ణ, ఇటు బోయపాటి ఇద్దరు ఫ్లాప్‌ల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై వారిద్దరు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన లెజండ్, సింహా చిత్రాలు మంచి విజయాన్ని సాధించగా.. ఇప్పుడు మూడో మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Read This Story Also: ఆ జాబితాలో రోహిత్ పేరు లేకపోవడం చూసి షాక్‌కి గురయ్యా..!

Follow Us