Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

ఇటీవలే బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Updated on: Dec 12, 2021 | 10:29 PM

ఇటీవలే బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు.రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా అనే విలాసవంతమైన హోటల్‌ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. అయితే విక్ట్రీనా పెళ్లి ఫొటోలు, వీడియోలు, పుటేజీ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందన్న వార్తలు రావడం, అందుకు తగ్గట్టే పెళ్లి జరిగినా చాలా సేపటి వరకు పెళ్లి ఫొటోలు, వీడియోలు అధికారికంగా బయటకు రావడం లేదు. పెళ్లి వేడుక అనంతరం వరుడు విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెళ్లి ఫొటోలు పంచుకున్నాడు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఆ తర్వాత కత్రినా కూడా తన మెహెందీ, సంగీత్‌, తదితర ప్రి వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

విక్ట్రీనా పెళ్లికి హాజరైన అతిథులందరికీ సిక్స్ సెన్సెస్‌ హోటల్లోనే వసతి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్కీ కౌశల్ కజిన్ ఉపాసన వొహ్రా, ఆమె భర్త అరుణేంద్ర కుమార్‌ హోటల్‌ అందాలను తమ కెమెరాలో బంధించారు. అనంతరం తమ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకున్నారు. హోటల్‌లో విలాసవంతమైన గదులు, పరిసరాలు, చుట్టపక్కల ప్రాంతాలను కూడా ఈ వీడియోలో చూపించారు. దీంతో ఈ వీడియోను చూసిన వారు హోటల్‌ రాజమహల్‌ను తలపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన విక్ట్రీనా పెళ్లి వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి

Pushpa MASSive Pre Release Party: గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్.. బన్నీ ఎంట్రీతో దద్దరిల్లిన పోలీస్ గ్రౌండ్..

Loading...
Unable to load recommendations.
Follow Us