Venkatesh Daggubati: వరుస సినిమాలతో బిజీగా వెంకీమామ… విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ఆ దర్శకుడితోనేనా…

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ ఎంత కూల్‌గా ఉంటాడో అంతే ఫాస్ట్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలుపెడుతుంటాడు

Venkatesh Daggubati: వరుస సినిమాలతో బిజీగా వెంకీమామ... విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ఆ దర్శకుడితోనేనా...
Venkatesh Daggubati
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 19, 2021 | 8:31 AM

Venkatesh Daggubati: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ ఎంత కూల్‌గా ఉంటాడో అంతే ఫాస్ట్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలుపెడుతుంటాడు. చిన్న దర్శకుడు స్టార్ దర్శకుడు అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు వెంకీ పెట్టింది పేరు. కుర్రహీరోలకు పోటీగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు వెంకటేష్. ఓ పక్క నారప్ప.. ఎఫ్‌3 షూట్‌ లో పాల్గొంటూనే.. మరో పక్క దృశ్యం2 సినిమాని పట్టాలెక్కించాడు. తాజాగా వెంకటేష్‌ దృశ్యం2 సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశాడు.

అయితే వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 74 సినిమాలు చేసిన వెంకటేష్ ఇప్పుడు 75 వ సినిమాకోసం సిద్ధమవుతున్నారు. అయితే అది త్రివిక్రమ్ తోనే అని ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ‘మల్లీశ్వరి’ సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. ఈ రెండు సినిమాలు భారీవిజయాలను అంతే కాదు వెంకీ కెరియర్లో మైలు రాళ్లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో సినిమా ఉంటుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telangana Devudu Movie: ‘తెలంగాణ దేవుడు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…