Vakeel Saab Movie: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. తేల్చి చెప్పిన ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్..

|

Apr 13, 2021 | 10:24 AM

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల..

Vakeel Saab Movie: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. తేల్చి చెప్పిన ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్..
Vakeel Saab
Follow us on

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండంతో ‘వకీల్ సాబ్’ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ విపరీతమైన ప్రచారం నడుస్తోంది. కరోనా కారణంగా చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఓటీటీ వేదికగా ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కాబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ అభిమానులు నిజంగానే ‘వకీల్ సాబ్’ చిత్రం ఓటీటీ లోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ ప్రచారంపై తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ‘వకీల్ సాబ్’ సినిమా ఓటీటీలో వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. దయచేసి పుకార్లను నమ్మొద్దని కోరింది. ప్రస్తుతానికి ఈ సినిమాను ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని, అలాంటి ఆలోచనే లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్ర నిర్మాణ సంస్థ..‘సినిమాపై వస్తున్న వార్తలను పెట్టండి. ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి’ అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.

బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘వకీల్‌ సాబ్’ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించగా.. ప్రకాశ్ రాజ్, శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్ నిర్మించారు.

Also read:

Telangana Corona Cases Updates: తెలంగాణలో భారీగా పెరిగి కరోనా బాధితుల సంఖ్య.. అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే..

Tirupati By-Election: చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన.. కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు..

వాష్ రూమ్ కి వెళ్లి వస్తా అంటూ పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన వధువు… చివరికి ఏమైందంటే… ( వీడియో )