Varun Tej: మెగా హీరో కోసం రంగంలోకి దిగుతోన్న తమిళ హీరో.. విలన్‌ పాత్రలో కనిపించనున్న..

Varun Tej: మెగా వరుణ్‌ తేజ్‌ ఎఫ్‌3 సినిమాను పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలవ్వక ముందే వరుణ్‌ మరోసారి చిత్రాన్ని మొదలు పెట్టాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో...

Varun Tej: మెగా హీరో కోసం రంగంలోకి దిగుతోన్న తమిళ హీరో.. విలన్‌ పాత్రలో కనిపించనున్న..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:10 PM

Varun Tej: మెగా వరుణ్‌ తేజ్‌ ఎఫ్‌3 సినిమాను పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలవ్వక ముందే వరుణ్‌ మరోసారి చిత్రాన్ని మొదలు పెట్టాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకు వరుణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. దీంతో సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాలో తాజాగా విలన్‌ పాత్రను ఖరారు చేశారు.

తమిళంలో హీరో వినయ్‌ రాయ్‌ని ఈ సినిమాలో విలన్‌గా తీసుకోనున్నారు. వినయ్‌ రాయ్‌ అంటే తెలియకపోయినా ‘వాన’ సినిమా హీరో అంటే తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు. వాన చిత్రం తర్వాత వినయ్ తమిళంలో ఎక్కువగా సినిమాలు తీశాడు. అనంతరం డిటెక్టివ్‌, డాక్టర్‌ వంటి చిత్రాల్లో విలన్‌గాను మెప్పించాడు. ఈ సినిమాల్లో విలన్‌గా అద్భుత నటనకు ఫిదా అయిన ప్రవీణ్‌ సత్తారు విలన్‌ పాత్ర కోసం అప్రోచ్‌ అయినట్లు సమాచారం.

Vinay Ray

దీనికి వినయ్‌ కూడా వెంటనే ఓకే చెప్పడాని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ మొత్తం విదేశాల్లోనే తెరకెక్కించనున్నారు.. దీంట్లో 80 శాతం లండన్‌లో, మిగతా 20 శాతం యూరప్‌లో ప్లాన్‌ చేశారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..