
ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు(BA Raju) తనయుడు, డైరెక్టర్ శివకుమార్ (Siva Kumar) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు లావణ్య (Lavanya)తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఈనెల 22న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అనంతరం ‘పుణెలో పెరిగి హైదరాబాద్ లో స్థిరపడిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో నా వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ తన వివాహ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
సరిగ్గా ఆ ముహూర్తానికే..
పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి అగ్రదర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు శివకుమార్. ఆ తర్వాత దర్శకుడిగా మారి ’22’అనే సినిమాను తెరకెక్కించాడు. కాగా శివకుమార్ కు ఇష్టమైన సంఖ్య 22. అందుకే తన మొదటి సినిమాకు సైతం ’22’ అనే టైటిట్ పెట్టాడు. ఇక తన పెళ్లి ముహూర్తం కూడా తన ఇష్టమైన సంఖ్యతోనే సెట్ చేసుకున్నాడు. సరిగ్గా 2022, జనవరి22వ తేదీన, 22 గంటలకు శివకుమార్, లావణ్యలు పెళ్లి చేసుకోవడం విశేషం. కాగా వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..
Andhra Pradesh: ఏపీలో8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ కమిషనర్ గా ఎవరు రానున్నారంటే..