Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను లైన్ లోపెడుతున్నారు. జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్న చరణ్.. ఆ తర్వాత కూడా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలనే కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లో 15 మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి వినయ విధేయ రామ అనే సినిమా చేస్తారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. ఇక ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు కొందరు. అలాగే ఈ సినిమాలో చరణ్ సీఎం గా కనిపిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక మూవీకి సంబంధించిన బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది. షూటింగ్ జరుపుకుంటుండగానే కార్పోరేట్ కంపెనీలు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. ఇప్పటికే హిందీ రైట్స్ ని జీ స్టూడియోస్ దక్కించుకుంది. హిందీ థియేట్రికల్ రైట్స్ సహా శాటిలైట్.. డిజిటల్ హక్కుల్ని జీ స్టూడియోస్ చేజిక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. దాదాపు 350 కోట్లు ఖర్చు చేసి హిందీ రైట్స్ ను దక్కించుకున్నారట. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. జూన్ నెలాఖరకు షూటింగ్ మొత్రం పూర్తవుతుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :