Yuvarathnaa Trailer : ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్

కన్నడ సినిమాలు తెలుగులో ఇటీవల మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలై తెలుగులోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Yuvarathnaa Trailer : ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్
Yuvarthna

Updated on: Mar 20, 2021 | 5:31 PM

Yuvarathnaa Trailer : కన్నడ సినిమాలు తెలుగులో ఇటీవల మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలై తెలుగులోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కంటెంట్ నచ్చితే తెలుగు ప్రజలు సినిమాను భారీగా ఆదరిస్తారని తెలుసుకున్న కన్నడ దర్శక నిర్మాతలు తమ చిత్రాలను తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల ధృవ్ సర్జా నటించిన పొగరు, దర్శన్ నటించిన రాబర్ట్ సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ఉపేంద్ర నటిస్తున్న కబ్జా సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ నటించిన యువరత్న సినిమాకూడా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సినిమాలో పునీత్ రాజ్ కు జోడిగా సయేషా సైగల్ నటించింది. సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యా సంస్థలో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపడంతో పాటు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాలో పునీత్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపైనే అంచనాలను పెంచేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sai Pallavi : సమ్మర్ స్పెషల్ గా సాయిపల్లవి .. రెండు సినిమాలతో పలకరించనున్న ఫిదా బ్యూటీ

Deepika Pilli : గుడిలో డ్యాన్స్ లు చేసిన టిక్ టాక్ స్టార్… ఇదేంపనంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Follow Us