ఆ హీరో ఓ అద్భుతం.. అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..! ఆ సినిమాలో యాక్టింగ్ ఇరగదీశాడు..

తమిళ చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో విశాల్ ఒకరు. ఎక్కువగా యాక్షన్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. దాదాపు 24 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న విశాల్.. కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు మకుటం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విశాల్.

ఆ హీరో ఓ అద్భుతం.. అతనిలా నటించడం ఎవరివల్ల కాదు..! ఆ సినిమాలో యాక్టింగ్ ఇరగదీశాడు..
Vishal

Updated on: Aug 10, 2026 | 4:26 PM

యాక్షన్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియెట్స్ చేసుకున్నాడు విశాల్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు విశాల్. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోయిన విశాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. ప్రస్తుతం విశాల్ మకుటం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విశాల్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విశాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే విశాల్, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం గురించి అలాగే.. ఆ సీన్‌లో కనబరిచిన అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ నటన అద్భుతమని, సాటిలేనిదని విశాల్ పేర్కొన్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని చూసినప్పుడు తాను స్క్రిప్ట్ గురించి పూర్తిగా మర్చిపోయానని, ఎన్టీఆర్ చూపిన భావోద్వేగాల తీవ్రత తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ నటన తెరపై ఒక విస్ఫోటనంలా, అగ్నిపర్వతంలా అనిపించిందని విశాల్ అన్నారు. ఈ మ్యాజిక్‌ను, ఆ భావోద్వేగ తీవ్రతను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను టెంపర్ చిత్రాన్ని రీమేక్ చేశానని ఆయన వెల్లడించారు. ఈ రీమేక్ ద్వారా ఆ అద్భుతమైన నటనకు మరింత అవగాహన కల్పించాలనుకున్నట్లు విశాల్ వివరించారు. ఎన్టీఆర్ టెంపర్ క్లైమాక్స్‌లో చూపిన నటన తనను ఎంతగానో ప్రభావితం చేసింది, అందువల్లే ఆయన ఆ చిత్రానికి రీమేక్ చేయడానికి ప్రేరణ పొందినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us