Jana Nayagan Twitter Review: విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్.. టైటిల్ కార్డ్ అదిరిపోయింది.. అడియన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే..

సెన్సార్ సమస్యలు, ఆన్‌లైన్ లీక్ కారణంగా పలుమార్లు ఆలస్యమైన తర్వాత విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమా ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇది సీఎం విజయ్ చివరి సినిమా కావడంతో ముందు నుంచి ఈ మూవీపై మరింత బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.

Jana Nayagan Twitter Review: విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్.. టైటిల్ కార్డ్ అదిరిపోయింది.. అడియన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే..
Jana Nayagan

Updated on: Jul 23, 2026 | 8:00 AM

కోలీవుడ్ హీరో.. తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన సినిమా జన నాయగన్. హీరోగా ఆయనకు ఇది చివరి సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత బజ్ నెలకొంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. కేరళ కుట్టి మమితా బైజు కీలకపాత్ర పోషించింది. గతంలోనే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కావాల్సి ఉండగా.. సెన్సార్ ఇష్యూ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతలోపే తమిళనాడులో ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రసారం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో పలువురిపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇక అడ్డంకులు అన్ని తొలగిపోయి ఎట్టకేలకు జన నాయగన్ థియేటర్లలోకి వచ్చింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా గురించి నెటిజన్లు ఏమంటున్నారు? హెచ్. వినోద్ దర్శకత్వాన్ని వారు ఎలా చూస్తున్నారు? బాబీ డియోల్, మమితా బైజు, పూజా హెగ్డే, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్ , ఇతరుల నటన గురించి వారు ఏమంటున్నారు? సాంకేతిక విలువలు, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతంపై వారి అభిప్రాయం ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

జూలై 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ రియాక్షన్ పంచుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ టైటిల్ కార్డు అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ సినిమాల్లో టైటిల్ కార్డ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈసారి సైతం ఆయన టైటిల్ కార్డు వేరేలెవల్ అంటున్నారు. విజయ్ లాస్ట్ సినిమాకు ఎలాంటి హీరో టైటిల్ కార్డు వేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక ఇప్పుడు విజయ్ టైటిల్ కార్డు గురించి చర్చించుకుంటున్నారు.

గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ సమావేశంలో విజయ్ ను కామెంట్స్ చేస్తూ చెయ్యి చూపిస్తూ నీ పని అయిపోయింది అన్నారు. అందుకు కౌంటర్ ఇస్తూ విజయ్ అసెంబ్లీలో అంతా అయిపోయింది అన్నట్లు చెయ్యి చూపిస్తూ స్టాలిన్ ను ఇమిటేట్ చేశాడు. దీంతో అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వడంతో అది సిగ్నేచర్ మూమెంట్ లా మారి వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు దానినే హీరో టైటిల్ కార్డులా వాడడం గమనార్హం. ఆ సిగ్నేచర్ మూమెంట్ మాత్రమే చూపించడం కాక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు C జోసెఫ్ విజయ్ అని టైటిల్ వేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ట్వీట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

Follow Us