AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన ప్రేమకథ ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది. తెరపై తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఈ జంటకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు విజయ్, రష్మిక.

అప్పుడు రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు : విజయ్ దేవరకొండ
Vijay Deverakonda, Rashmika
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2026 | 12:16 PM

Share

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన రణబాలి సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతుంది.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో వచ్చిన రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. రోజు రోజుకు రణబాలి సినిమా కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న తమ ప్రేమకథకు సంబంధించి పంచుకున్న వివరాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రష్మికకు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలని విజయ్ భావించారట. అయితే, చివరి నిమిషంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదట.

రీసెంట్ గా విజయ్, రష్మిక కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌ షోకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విరోష్ జంట అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడారు. సాధారణంగా తాను రొమాంటిక్ విషయాలను ముందుగా ఎక్కువగా ప్లాన్ చేయనని విజయ్ చెప్పారు. అయితే, రష్మిక జీవితంలో గుర్తుండిపోయేలా ఓ అందమైన ప్రపోజల్ మూమెంట్ ఉండాలని విజయ్ కోరుకున్నాడట. అందుకోసం ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలని ప్లాన్ కూడా చేశాడట.

పెళ్లికి ముందు డిసెంబరులో ఇటలీకి వెళ్లిన సమయంలో రష్మికకు ప్రపోజ్ చేయాలని విజయ్ అనుకున్నాడట. అందమైన ప్రదేశంలో తన మనసులోని మాటను చెప్పి, ఆ క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించాడట. అయితే, ఆ సమయంలో తనకు నచ్చిన ఉంగరం దొరకకపోవడంతో అనుకున్న ప్లాన్ అమలు కాలేదని తెలిపాడు. రష్మికకు ప్రపోజ్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, సరైన ఉంగరం దొరకకపోవడం వల్ల ఆ ప్రత్యేకమైన క్షణాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని సరదాగా గుర్తుచేసుకున్నాడు విజయ్. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..