ఇండియన్స్ లేని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పిన వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. అలాగే చిత్ర విచిత్రమైన పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఆయనతో పూజ చేయించుకుంటారు.

ఇండియన్స్ లేని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తా..  ఓపెన్‌గా చెప్పిన వేణు స్వామి
Venu Swamy

Updated on: Apr 01, 2026 | 12:13 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వేణు స్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆఫర్‌ను తాను ఎందుకు తిరస్కరించానో వివరించారు. పది వారాల పాటు షోలో ఉండేందుకు, అత్యధిక పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ, బిగ్ బాస్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ తనకు సరిపోదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం, తన సర్కిల్, తన ప్రమాణాలు పూర్తిగా భిన్నమైనవని, అవి ఇటువంటి షోలకు అనుకూలం కావని వేణు స్వామి పేర్కొన్నారు. ప్రైవేటు జీవితానికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని వేణు స్వామి తెలిపారు. ఇంట్లో తనకు నచ్చిన ఫుడ్‌ను తెప్పించుకుని, జంధ్యాల గారి కామెడీ సినిమాలు చూస్తూ, పెగ్గు వేసుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తానని వివరించారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

పబ్లిక్‌గా కనిపించి ఎంజాయ్ చేయడాన్ని తాను ఇష్టపడనని, ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే, తెలుగు జనాలు, ఇండియన్స్ లేని విదేశీ ప్రాంతాలను ఎంచుకుంటానని చెప్పారు వేణు స్వామి. సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియాపై వేణు స్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఇతరుల నాశనాన్ని కోరుకునే ఒక “సైకో ప్రవృత్తి” జనాల్లో పెరిగిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. నెగెటివిటీ, అసూయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్లను అందించినందుకు సోషల్ మీడియాకు, మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్‌స్టార్‌గా మెరుగుపరుస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు. తనకు నెగెటివ్ పబ్లిసిటీ అంటే ఇష్టమని, అది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు వేణు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

తనకు సులభంగా కోపం గానీ, ఏడుపు గానీ రాదని తెలిపారు. ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే, దాని పట్ల తన ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని, “విజయమో వీరమరణమో” అన్నట్టుగా ఉంటుందని వివరించారు. ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, చిన్న చిన్న విషయాలను తాను పట్టించుకోనని చెప్పారు. దావూద్ ఇబ్రహీం వంటి వ్యక్తిని చంపాలనుకోవడం అనేది “చాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్” అని వ్యాఖ్యానిస్తూ, నిర్ణయం తీసుకోవడమే గొప్ప విషయమని, ఆ వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కేవలం వెంకటేశ్వర స్వామికి, కామాక్షి అమ్మవారికి మాత్రమే తాను కృతజ్ఞతలు తెలుపుతానని, ఇతరులకు “ప్లీజింగ్” లేదా “థ్యాంక్ యూ” వంటి పదాలు వాడనని వేణు స్వామి పేర్కొన్నారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us