
Uppena first day collection: మెగాహీరో వైష్ణవ్‌తేజ్ ఈ శుక్రవారం తొలి సినిమా ‘ఉప్పెన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగా క్రేజ్ మాములుగా ఉంటుందా చెప్పండి. అందుకే తొలి సినిమాతోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. టాలీవుడ్లో ఓ మీడియం బడ్జెట్ చిత్రానికి తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ట్రేడ్ పండితులు చెబతున్నారు.
ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్‌తో పాటు, కృతిశెట్టి కూడా టాలీవుడ్లో అరంగేట్రం చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయమయ్యారు. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వరుసగా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబట్టింది ఉప్పెన సినిమా.
కాగా మొన్నటి వరకు థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే 100 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఉప్పెనకు కలిసొచ్చింది. ఇక శని, ఆదివారంలతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఉప్పెన చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read: