మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె చెల్లెలు ఉనుష్పా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైన రోజు నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఉపాసన. తాజాగా తన సోదరి అనుష్పా పెళ్లి జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. తన చెల్లెలు పెళ్లి ఫోటోలను షేర్ చేసుకుంది ఉపాసన.
తన సోదరి అనుష్పాల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి చిన్న సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది ఉపాసన. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ నెట్టింట్లో షేర్ చేసుకుంటున్నారు ఉపాసన. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు పెళ్లి జరిగడంతో ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపింది ఉపాసన. తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఉపాసన. అలాగే తన చెల్లెలు పెళ్లికి అందరూ అందించిన విషెస్, ప్రేమకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యింది ఉపాసన. అయితే ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో రామ్ చరణ్ రాయల్ లుక్లో అదిరిపోయాడు.