Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

తెలుగు సినీప్రియుల హృదయాల్లో చెరగని రూపం ఉదయ్ కిరణ్. ఈ పేరు వినగానే ప్రతి ప్రేక్షకుడి మనసు చెదిరిపోతుంది. ఒకప్పుడు సినీపరిశ్రమను ఓ ఊపు ఉపేశాడు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సునామీలా దూసుకొచ్చాడు. లవర్ బాయ్ గా యూత్ లో విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్.

Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..
Uday Kiran

Updated on: Feb 02, 2026 | 11:07 AM

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఉదయ్ కిరణ్. కెరీర్ మొదట్లోనే వరుస హిట్లతో తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపేశాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో సునామీల దూసుకొచ్చాడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఓ సాధారణ కుర్రాడు అప్పట్లోనే అమ్మాయిల డ్రీమ్ హీరోగా మారిపోయాడు. వరుస ప్రేమకథలతో వరుస విజయాలను ఖాతాలను వేసుకున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఉదయ్.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమయ్యాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు.. కెరీర్ లో హిట్స్ రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

చిత్రం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే మనసంతా నువ్వే మూవీతో మరోసారి ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు హిట్స్ అందుకుని తిరుగులేని స్టార్ అయిపోయాడు. తక్కువ సమయంలోనే అలరించిన ఉదయ్.. మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఓ త్రోబ్యా్క్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఉదయ్ తన కెరీర్, లైఫ్ కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. “నా బర్త్‌డే సందర్భంగా అందరూ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు ఇవ్వండి. లక్ కావాలి, హ్యాపీ బర్త్‌డే అని చెప్పండి. నా సినిమాల మధ్య గ్యాప్ గురించి అడిగితే… లక్, ఫేట్, టైమింగ్ అన్నీ కలిసి రావాలి. మొదట్లో బాగా సాగింది. మంచి మంచి స్టోరీలు వచ్చాయి. తర్వాత లక్ కంటిన్యూ కాలేదు. రోల్స్, స్టోరీలు సరిగ్గా రాలేదు. తమిళంలో కూడా చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. మంచి మంచి స్టోరీలు ఆఫర్ అయ్యాయి. కానీ నేను చేసిన సినిమాల సంఖ్య మూడే. ఇంకా ఎక్కువ సినిమాలు, మరింత మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఓపెన్‌గా చెప్పాలంటే… అక్కడ ఒక్కటీ కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. కానీ హోప్‌ఫుల్‌గా ఉన్నాను. భవిష్యత్తులో మరిన్ని మంచి ఛాన్స్‌లు వస్తాయని ఆశిస్తున్నాను” అని అన్నారు..

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

“కెరీర్‌పై వచ్చిన క్రిటిసిజం, పర్సెప్షన్ గురించి మాట్లాడితే… ‘పర్సెప్షన్’ అనే పదం సరిగ్గా సరిపోతుంది. చాలా క్రిటిసిజం వచ్చింది, రూమర్లు వచ్చాయి. అదే సమయంలో ఫ్యాన్స్ నుంచి ఇంకా చాలా లవ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా విషయాలు జరిగాయి. నేను మాటలతో కాకుండా వర్క్‌తో మాట్లాడా అనుకుంటాను. అదే నా స్వభావం. ఇప్పుడు ‘దిల్ కబడ్డీ’తో కమ్‌బ్యాక్ చేస్తున్నా. ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి తీశాం. మార్పు అవసరమని అనుకున్నాం. క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఉన్నా, కన్నీళ్లు పెట్టినా… ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. టెన్షన్, రౌడీ ఎలిమెంట్స్, ఎమోషన్ అన్నీ ఉండాలి. చివరికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. క్రమంగా స్టోరీలోకి లాగేసి ఫీల్ కలిగించాలి. అదే మంచి స్టోరీ బలం అని నేను భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..