Vakeel Saab Movie : ఒడిశాలో “వకీల్‌ సాబ్‌” కి షాక్‌..! రెండు థియేటర్లు సీజ్‌.. ఎందుకో తెలుసా..?

Vakeel Saab Movie : పవన్‌ కల్యాణ్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులున్నారు. ఒడిశాలో వకీల్‌ సాబ్‌ సినిమా చూడటానికి జనాలు పోటెత్తుతున్నారు. దీంతో కొవిడ్ నిబంధనలు

Vakeel Saab Movie : ఒడిశాలో వకీల్‌ సాబ్‌ కి షాక్‌..!  రెండు థియేటర్లు సీజ్‌.. ఎందుకో తెలుసా..?
Vakeel Saab

Updated on: Apr 12, 2021 | 11:13 AM

Vakeel Saab Movie : పవన్‌ కల్యాణ్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులున్నారు. ఒడిశాలో వకీల్‌ సాబ్‌ సినిమా చూడటానికి జనాలు పోటెత్తుతున్నారు. దీంతో కొవిడ్ నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. రెండు థియేటర్లను సీజ్‌ చేశారు. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రెండు థియేటర్లలో వకీల్‌సాబ్‌ విడుదలైంది. సినిమాను చూసేందుకు ఆదివారం పవన్‌ అభిమానులు అత్యధిక సంఖ్యలో సినిమా హాళ్ల వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో సినిమాహాళ్ల యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించాయని ఆరోపిస్తూ పర్లాఖెముండిలోని థియేటర్లపై జిల్లా అధికారులు చర్యలకు దిగారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వకీల్‌ సాబ్‌ రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. కరోనా టైంలో కూడా పవన్ మానియా బాగా పనిచేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38 నుంచి రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

అమెరికాలో ఈ చిత్రాన్ని వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సుమారు 260కి పైగా లోకషన్లలో విడుదల చేశాయి. అక్కడ ఒకరోజు ముందుగానే(ఏప్రిల్ 8న) పడ్డ ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వీకెండ్ సినిమా వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు వకీల్ సాబ్‌కు 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని వీకెండ్ సినిమా ట్వీట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల(యూఎస్ కాలమానం ప్రకారం) వరకు ఈ వసూళ్లు వచ్చినట్లు తెలియజేసింది. లాక్‌డౌన్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రం కూడా వకీల్ సాబే.ఇక  వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కాబట్టి వారాంతంలో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, పవన్ కల్యాణ్ చివరగా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది.

Minister Nani vs Nagababu: ట్విట్టర్ వేదికగా మంత్రి నాని, నాగబాబు మధ్య మాటల యుద్ధం.. కారణమదేనా..?

Corona Virus: సుప్రీం కోర్టు సిబ్బందిలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్.. వర్చువల్ విధానంలో కేసుల విచారణ

నమ్మించి నయవంచన చేసే మహామాయగాడు, 7 రాష్ట్రాల్లో ఎన్నో నేరాలు, హైటెక్ బుర్రతో ఎన్ ఫీల్డ్ కొట్టేసి 5వేల కిలోమీటర్ల ప్రయాణం

 

Loading...
Unable to load recommendations.
Follow Us