
ప్రముఖ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కామెడీ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ పాత్రలు చేస్తూనే కామెడీని కూడా పండించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్ శ్రీను. స్టార్ హీరోల సినిమాల్లో నటించారు ప్రభాస్ శ్రీను.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ప్రభాస్ కు ఎంతో సన్నిహితుడైన శ్రీను. ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో తన పేరును ప్రభాస్ శ్రీనుగా మార్చుకున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ హీరో తనను నిజంగానే కొట్టాడని.. అతను కొట్టిన కొట్టుడికి జ్వరం వచ్చిందని తెలిపాడు ప్రభాస్ శ్రీను.
ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో మాస్ మహారాజా రవితేజతో తన అనుభవాలను గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రవితేజ చాలా బోళా మనిషి అని, మనసులో ఏదీ దాచుకోరని శ్రీను తెలిపారు. ఆయన అత్యంత ప్రాక్టికల్ వ్యక్తి అని, అనవసరమైన ఆర్భాటాలు, ప్యాంపరింగ్‌లను అస్సలు ఇష్టపడరని చెప్పుకొచ్చారు. నచ్చకపోతే వెంటనే చెప్పేసే స్వభావం ఆయనదని, సమయాన్ని వృథా చేయరని అన్నారు. అలాగే నటుడిగా రవితేజ ఏ క్యారెక్టర్‌లో నటించినా, అందులో తనదైన ప్రత్యేక శైలిని అద్భుతంగా మిళితం చేస్తారని, ఆ పాత్రను సులభంగా తన వశం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. తెరపై రవితేజ డైలాగ్స్ చెప్పే విధానం, ఆయన క్యారెక్టర్ డీలింగ్ చాలా సహజంగా ఉంటుందని, అందులో ఎలాంటి ట్రాన్సోవర్ ఉండదని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్, కామెడీని బ్లెండ్ చేసే క్వాలిటీ ఉండేదని ప్రభాస్ శ్రీను పోల్చారు. స్కిట్లు, కామెడీ డైలాగులు చెప్పి నవ్వించడం కాదని, క్యారెక్టర్‌తో ఆటిట్యూడ్‌ను, కామెడీని తీసుకెళ్తే అది ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని, అది రవితేజ గారి ప్రత్యేకత అని శ్రీను తెలిపారు. రవితేజతో విక్రమార్కుడు షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను శ్రీను పంచుకున్నారు. రవితేజ తమను కొట్టే సన్నివేశాల్లో నిజంగానే దెబ్బలు తగిలేవని, బ్యాక్ సైడ్ ప్యాడ్స్ పెట్టేవారు కాదని అన్నారు. ఆ సీన్‌ను నాలుగైదు రోజులు కంటిన్యూగా షూటింగ్ చేశారని., నిజంగానే దెబ్బలు తగిలాయని, ఒకసారి కన్నన్ అనే రైటర్ కి అయితే జ్వరం వచ్చిందని తెలిపారు. రవితేజ తెరపై ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలాగే ఉంటారని చెప్పుకొచ్చారు ప్రభాస్ శ్రీను.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.