
సినిమాలు జనాల పై ఎంత ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. అలాగే కొన్ని పాటలు కూడా ప్రేక్షకుల పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ సాంగ్ వచ్చి 18 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాను ఎంత ఎంజాయ్ చేశారో.. ఈ పాటను కూడా అంతే ఎంజాయ్ చేశారు ఆడియన్స్. అప్పుడు సాంగ్ ను ఎంజాయ్ చేశారు.. ఇప్పుడు చాలా మంది ఆ సాంగ్ ను ఫీల్ అవుతున్నారు. పాట వినడానికి ఎదో సాధారణ సాంగ్ లాగే ఉంటుంది కానీ అందులో జీవితానికి సరిపోయేంత అర్ధం ఉంది. ఆ సినిమా ఎదో కాదు.. యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న కొత్తబంగారు లోకం.
కొత్తబంగారు లోకం సినిమా ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. యూత్ లో ఈ సినిమా చెరగని ముద్ర వేసుకుంది. 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఇందులో ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జయసుధ కీలకపాత్రలలో నటించారు.
ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా కథ… సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన తీరుకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ డైలాగ్స్ అప్పట్లో ఎంతగా ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన పాటల్లో నీ ప్రశ్నలు నీకే సాంగ్ ఒకటి. ఈ సాంగ్ లో ఎంతో అర్ధం ఉంది. ఈ పాటలో ప్రేమ గురించి వివరిస్తూనే.. జీవితం గురించి ఎంతో వివరించారు సిరివెన్నెల. ఇక ఈ సాంగ్ లో కొన్ని లిరిక్స్ చాలా మంది మనసులకు తాకుతుంది. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా.? కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా.?.. పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా..? ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా.? అనే పదాలు చాలా మంది ఫీల్ అవుతుంటారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..