
ఒకప్పుడు దక్షిణాదిలో తనదైన నటన, గ్లామర్ ఫోజులతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో లక్షలాది మంది హృదయాలు కొల్లగొట్టిన హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో అందంలో హీరోయిన్ శ్రీదేవికే పోటీ ఇచ్చింది. కానీ ఒక చిన్న తప్పుతో సినిమాలకు దూరమైంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ దీప అసలు పేరు ఉన్ని మేరి. 1970, 80వ దశకాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. కేరళలోని ఎర్నాకులంలో 1962 మార్చి 12న అగస్టిన్ ఫెర్నాండెజ్, విక్టోరియా దంపతులకు జన్మించారు దీప. అసలు ఉన్ని మేరి కానీ.. సినీరంగంలోకి వచ్చాక తన పేరును దీపగా మార్చుకున్నారు. అప్పట్లోనే గ్లామర్ ఐకాన్ గా రాణించింది. మూడేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ప్రారంభించిన ఆమె.. దేశ విదేశాల్లో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు. ఆమె తల్లి విక్టోరియా.. ప్రొఫెషనల్ బ్యాలెట్ ట్రూప్ నడిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
1969లో నవవధు అనే మలయాళి చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 1975లో ఆమె కెరీర్ మలుపులు తిప్పింది. 1976లో అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని పాడనా తెనుగు పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత తెలుగులో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పిల్ల జమీందార్, దాన వీర శూర కర్ణ, రంగుల రాట్నం, అక్కినేని నాగేశ్వరరావు, తాతయ్య ప్రేమలీలలు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు బాలకృష్ణతో తాతమ్మ కల, చిరంజీవితో ప్రేమ లేఖలు వంటి చిత్రాల్లోనూ కనిపించారు. స్వాతి ముత్యం సినిమాలో సుబ్బులు పాత్రలో నటించారు. 23 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె బరువు పెరిగింది. చిన్న వయసులోనే ఆమె తల్లి ఎక్కువగా బిస్కెట్స్, చాక్లెట్స్ వంటి పదార్థాలు తినడం వల్లే ఆమె బరువు పెరిగి ఉండొచ్చని గతంలో నటుడు మురళి మోహన్ ఓ ఇంటర్వ్యలో పేర్కోన్నారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఎర్నాకులం సెయింట్ అల్బర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ రేజోయ్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పటికీ ఆమె ప్రైవేట్ లైఫ్ గడుపుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
Deepa. News
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..