
హీరోలు బిజినెస్ చేయడం కొత్త విషయమేమీ కాదు.. నాటి శోభన్ బాబు నుంచి నేటి మహేష్ బాబు దాకా ఎంతో మంది హీరోలు ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తూ వస్తున్నారు. తమ తెలివితేటలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రావెల్స్, మల్టీప్లెక్స్.. ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు మన హీరోలు. అలా ఈ దక్షిణాది నటుడు కూడా బిజినెస్ లో టాప్ అని చెప్పుకోవచ్చు. గతంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా చేసిన ఈ నటుడు ఇప్పుడు అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. హీరోలు, హీరోయిన్లకు సోదరుడి పాత్రలు వేస్తూ సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. అయితే ఇలా సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లో అదరగొడుతున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అందుకే ఈ నటుడికి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా నెలకు కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు. గతంలోకి వెళితే.. హీరోగా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడే ఈ నటుడు చెన్నైలోని హాట్‌స్పాట్‌గా పేరుగాంచిన టి.నగర్‌లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో 10 అంతస్తులతో దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు. అందులో చాలా ప్రముఖ నగల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెనే లక్షల్లో ఉంటుందట. అలా ఈ మాల్ ద్వారాన నటుడికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది.
అలా ఒకప్పుడు దక్షిణాదిలో హ్యాండ్సమ్ ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బిజినెస్ లోనూ తోపు అనిపించుకుంటున్న ఆ నటుడు మరెవరో కాదు జీన్స్ ఫేమ్ ప్రశాంత్. కొన్నేళ్ల క్రితం చెన్నైలోని టి. నగర్ పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు ప్రశాంత్. దాదాపు 10 అంతస్తులతో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ ఉంది. జోయలుక్కాస్, వైట్ ఫైర్ డైమండ్స్ వంటి ప్రముఖ నగల బ్రాండ్‌లకు ఇది నిలయం. అంతేకాదు ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఈ మాల్ లో ఉన్నాయి. ఈ దుకాణల అద్దెనే లక్షల్లో ఉంటుందని సమాచారం. ఈ బిల్డింగ్ లోనే ప్రశాంత్ ఆఫీస్ కూడా నడుస్తోంది. ప్రశాంత్ సోదరి, నగల డిజైనర్ ప్రీతి త్యాగరాజన్ ఈ మాల్ మేనేజ్మెంట్ బాధ్యతలను చూసుకుంటోంది. కాగా ప్రశాంత్ కు సుమారు రూ. 150 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. 2024లో అంధాదూన్ రీమేక్ లో హీరోగా చేశాడు ప్రశాంత్. అదే ఏడాది దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు ప్రశాంత్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి