Aditi Govitrikar: తెరపై గ్లామరస్ బ్యూటీ.. జీవితంలో ఎన్నో సవాళ్లు.. చివరకు తండ్రి స్నేహితుడి చేతిలోనే..

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో అదితి గోవిత్రికర్ ఒకరు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో ఆమె ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది.ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Aditi Govitrikar: తెరపై గ్లామరస్ బ్యూటీ.. జీవితంలో ఎన్నో సవాళ్లు.. చివరకు తండ్రి స్నేహితుడి చేతిలోనే..
Aditi Govitrikar

Updated on: May 19, 2026 | 12:55 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తమ్ముడు సినిమా గురించి తెలిసిందే. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ.ఈ చిత్రం విడుదలై 27 ఏళ్లు గడుస్తున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమాలోని ‘వయ్యారిభామా నీ హంస నడక.. ఎందుకే ఈ తొందర తొందర’ ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన హీరోయిన్ గుర్తుందా.. ? ఈ పాటతో అప్పట్లో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ఈ చిత్రంలో లవ్లీ పేరుతో పాపులర్ అయ్యింది. దీంతో తెలుగు అడియన్స్ మనసులలో ఇప్పటికీ లవ్లీ పేరుతోనే నిలిచిపోయింది. కానీ ఆమె పేరు అదితి గోవిత్రికర్. తెలుగులో తమ్ముడు సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

అదితి గోవిత్రికర్.. 2001లో మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. తర్వాత తమ్ముడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి మాట్లాడుతూ చిన్న వయుసులోనే తనకు ఎదురైన చేదు సంఘటనలు గుర్తు చేసుకుంది. “నిజం చెప్పాలంటే, భద్రత పరంగా నేను ముంబైలోని పన్వెల్‌లోనే ఎక్కువ బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నాను. అక్కడ నాకు కొన్ని వేధింపుల అనుభవాలు ఎదురయ్యాయి, వాటి నుండి కోలుకోవడానికి కూడా నాకు చాలా కాలం పట్టింది. అప్పుడు నా వయసు కేవలం ఆరు ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టినవారిలో నా తండ్రి స్నేహితుడు కూడా ఉన్నాడు ” అంటూ చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

“నేను 12వ తరగతిలో అగర్వాల్ క్లాసెస్ కోసం దాదర్‌కు వచ్చేదాన్ని. ఆ సమయంలో నాకు లోకల్ ట్రైన్లు అందుబాటులో లేవు, అందుకే బస్సులో ప్రయాణించేదాన్ని. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. నిజం చెప్పాలంటే ప్రజా రవాణా జీవితంలో ఎలా బతకాలి అనేది నేర్పిస్తుంది ” అని చెప్పుకొచ్చింది. తమ్ముడు తర్వాత సినిమాలకు దూరంగా ఉంది అదితి. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us