ఆదమరచి నిద్రపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది..

ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చైల్డ్‏హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆదమరచి నిద్రపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది..
Celeb

Updated on: Aug 30, 2021 | 5:06 PM

ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చైల్డ్‏హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లాక్‏డౌన్ కారణంగా సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా.. తమ అభిమానులతో స్పెషన లైవ్ చిట్‏చాట్స్ నిర్వహిస్తూ.. వ్యక్తిగత విషయాలంతో తమ రేర్ ఫోటోలను సైతం షేర్ చేసుకున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. ఈ అమ్మడు ప్రస్తుతం చేతినిండా సినిమలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అటు వెండి తెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్‎ఫామ్‎లోనూ తన సత్తా కొనసాగిస్తోంది ఈ స్టార్ హీరోయిన్. ఇక ఇటీవలే… ఈ అమ్మడు బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తుంది. ఓ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

పైన ఫోటోలో ఉన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం థియేటర్లలో విడుదలన సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో తమ చిత్రాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీంతో వడివడిగా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. తమన్నా చేతినిండా సినిమాలతో నిత్యం బిజీగా గడిపేస్తుంది. ఎప్పుడూ షూటింగ్స్‏తో ఇప్పుడు విరామం దొరకిందని.. ఈ సమయాన్ని తనకు ఇష్టమైన పుస్తకం చదవడానికి ఉపయోగిస్తున్నట్లుగా తమన్నా తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా.. గోపిచంద్ జంటగా నటించిన సీటీమార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నితిన్, నభా నటేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న మాస్ట్రో సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

Tamanna

ట్వీట్..

Also Read: Vijay Sethupathi: సెప్టెంబర్ మొత్తం విజయ్ సేతుపతి హావా.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

Maestro Sneak Peak: కృష్ణాష్టమి రోజున మాస్ట్రో సర్‏ప్రైజ్.. అంధుడిగా ఆకట్టుకుంటున్న నితిన్..

Shruti Haasan: . ప్రేమ, పెళ్లిపై శ్రుతి హాసన్‏కు పిచ్చ క్లారిటీ.. అప్పుడే చెబుతానంటోన్న బ్యూటీ..

 

Loading...
Unable to load recommendations.
Follow Us