Thala Ajith’s Valimai : శరవేగంగా అజిత్ సినిమా షూటింగ్.. చివరి దశలో వాలిమై.. రష్యాలో టీమ్..

తమిళ్ హీరో అజిత్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి.

Thala Ajiths Valimai : శరవేగంగా అజిత్ సినిమా షూటింగ్.. చివరి దశలో వాలిమై.. రష్యాలో టీమ్..
Ajith

Updated on: Aug 21, 2021 | 9:08 AM

Thala Ajith’s Valimai : తమిళ్ హీరో అజిత్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల అజిత్ నటించిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలో అజిత్ ఇప్పుడు వాలమై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ రష్యాలో షూటింగ్ జరుపుకుంటుంది తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మధ్య ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వాలిమై ఫస్ట్ లుక్ రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ లుక్ లిస్ట్‌‌లో.. వాలిమై కూడా చేరిపోయింది. దీంతో వాలిమై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాలిమై డైరెక్టర్ వినోద్‌తో మరో మూవీ చేస్తున్నట్లు ఇటీవలే అజిత్ ప్రకటించాడు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ మూవీస్ చేసిన అజిత్.. తాజాగా వినోద్ కాంబినేషన్‌లో కూడా మూడో మూవీ ప్రకటించాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్‌ను ‘రష్యా’లో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి అక్కడ కొన్ని రోజుల పాటు షూటింగు జరగనుంది. అజిత్‌తో పాటు ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనికపూర్ నిర్మిస్తున్నారు. అలాగే అజిత్ సరసన హుమా ఖురేషి కనిపించనుంది. విలన్‌‌గా టాలీవుడ్ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us