Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

నేచురల్‌ స్టార్‌ నాని, మరో నేచురల్‌ బ్యూటీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'శ్యామ్‌ సింగ రాయ్‌'. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..

Updated on: Dec 23, 2021 | 2:59 PM

నేచురల్‌ స్టార్‌ నాని, మరో నేచురల్‌ బ్యూటీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ట్యాక్సీ వాలా’ వంటి థ్రిల్లర్‌ను తెరకెక్కించిన ‘రాహుల్ సంకృత్యాన్’ ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రేపు(డిసెంబర్‌24) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది సినిమా యూనిట్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరిస్తుండగా నిన్న నాని, సాయిపల్లవిల కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. తాజాగా మరొక అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’కు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘తార’ అనే మరో మెలోడి పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా యంగ్‌ సింగర్‌ కార్తీక్ ఆలపించాడు. మంచి మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాట సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Also read:

Writing with fire: ఆస్కార్‌ రేసులో ఇండియన్‌ డాక్యుమెంటరీ.. షార్ట్‌లిస్ట్‌ కాలేకపోయిన కూళంగల్‌..

Pushpa Movie: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత..

RRR Song Promo: ‘ఆర్ఆర్ఆర్’నుంచి ‘కొమురం భీముడో’ సాంగ్ ప్రోమో.. ఆలపించింది ఎవరో తెలుసా..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us