బిగ్‌బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ మీరా మిథున్ పై చెన్నై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమ సామాజిక వర్గం వారిని అలాగే సామాజిక సేవ చేసే కార్యకర్తలపై మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మీరా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా షెడ్యూల్డ్ కుల చిత్ర కార్మికులందరినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని మీరా మిథున్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలపాలు, నేరాలకు పాల్పడటం వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం లేకుండా ఎవరు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. చిత్రపరిశ్రమలోని షెడ్యూల్డ్ కులాల వారందరినీ, పరిశ్రమలోని డైరెక్టర్లను బయటకు పంపించే సమయం వచ్చిందనుకుంటున్నాను అని అన్నారు. గతంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దర్శకుడు.. తన సినిమా ఫస్ట్‌లుక్ కోసం తన సినిమా కోసం ఉపయోగించుకున్నాడని మీరా ఆరోపించింది.
మీరా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పలు కుల సంఘాల నేతలు.. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ అభిమాన హీరోహీరోయిన్స్‌ను అవమానించేలా మాట్లాడిందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఆమెపై ఇప్పటికే 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కేసులు విచారణ జరుగుతున్నాయని తెలిపారు.
Also Read: Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..