
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతనికి తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. కాగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కరుప్పు( తెలుగులో వీరభద్రుడు) శుక్రవారం (మే15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఎప్పటిలాగే సూర్య అభిమానులు థియేటర్ల దగ్గర నానా హంగామా చేశారు. సినిమా పోస్టర్లు, కటౌట్లతో రచ్చ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు అభిమానులు మరీ పిచ్చొళ్లలా ప్రవర్తించారు. సినిమాలో హీరో చేసే ఒక రిస్కీ ఫైట్ సీన్‌ను రీ-క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కొందరు యువకులు కత్తితో ప్రమాదకరమైన ఫీట్ చేశారు. ఒక యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని, కింద పడుకున్న మరో వ్యక్తి పొట్టపై ఉన్న ఒక ముల్లంగిని కత్తితో రెండు ముక్కలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సదరు అభిమానిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అదృష్టం కొద్దీ ఎవరికీ ఏం కాలేదు కానీ ఒక వేళ గురి తప్పి పొట్ట కత్తికి తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలన్నీ నిపుణుల సమక్షంలో గ్రాఫిక్స్ సహాయంతో చేస్తారని అభిమానులు గుర్తించాలని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే.. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. విలన్ గా ఆర్జే బాలాజీనే యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంద్రాన్స్, స్వస్తిక, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, అడుకలం నరేన్, దీపా శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు ఈ సినిమాను నిర్మించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు.
KARUPPU / #VeeraBhadrudu first Half REVIEW #Karuppu INTERVAL 🔥🔥 GOD MODE begin !!!!
INTRO of @Suriya_offl 🔥🔥 One of the career best intro ..@RJ_Balaji COOKED 🔥🔥🔥 , Screenplay 🔥👌 Well written & Presented , DOP Is Top notch , each & Evey frame is 🔥@SaiAbhyankkar… pic.twitter.com/1vIjnVkNpV
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) May 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.