Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

సీనియర్ నటి సురేఖా వాణి వారసురాలిగా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సుప్రిత. అలాగే పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్, రియాలిటీషోస్ లోనూ సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్
Supritha

Updated on: May 05, 2026 | 5:53 PM

సీనియర్ నటీమణి సురేఖా వాణి కూతురిగా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది సుప్రిత. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవలే అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ త్వరలోనే మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రానుంది. అలాగే పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేస్తోంది సుప్రిత. ఈ క్రమంలో సినిమాలు , టీవీ షోస్ తో బిజీ బిజీగా ఉండే సుప్రిత లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో బాడీ షేమింగ్ కారణంగా తానెలాంటి క్షోభ అనుభవించిందో చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. ‘సోషల్ మీడియాలో వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్ల వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. బరువు తగ్గాలనే ఆరాటంలో నా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నాను. రోజుకు 15 గంటల పాటు ఏమి తినకుండా పస్తులు ఉండేదాన్ని. అయితే తిన్న ఆ ఒక్క పూట కూడా బిర్యాని వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో నా ఆరోగ్యం పూర్తిగా చెడి పోయింది . తీవ్ర అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో నీళ్లు తాగినా సరే బయటకు వచ్చేవి. ఒకానొక దశలో బాధను భరించలేక నన్ను చంపేయమని ఆ దేవుడిని కోరుకున్నాను’ అంటూ వాపోయింది సుప్రిత.

అలాంటి పాత్రలకు కూడా సై..

‘ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. సినిమాలు కూడా చేస్తున్నాను. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా మంచి స్క్రిప్ట్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోల చిత్రాలలో చెల్లెలు పాత్ర వచ్చినా సరే వదులుకోను. కానీ విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని లాంటి హీరోల సరసన మాత్రం చెల్లెలిగా పాత్రలు చేయడం చాలా కష్టం’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది సుప్రిత. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కాగా ప్రస్తుతం సుప్రిత చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అలాగే పలు టీవీ షోస్ తోనూ బిజీ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

సుప్రిత గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us