Sumanth Ashwin: భూమిక గారు నా బైక్ ఎక్కినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి : సుమంత్ అశ్విన్

|

Sep 30, 2021 | 3:05 PM

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ సినిమాను నిర్మించారు.

Sumanth Ashwin: భూమిక గారు నా బైక్ ఎక్కినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి : సుమంత్ అశ్విన్
Sumanth
Follow us on

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ సినిమాను నిర్మించారు. టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.. ‘ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్, భూమిక, నేను, తాన్యా హాప్ అందరం రోడ్ ట్రిప్ బయల్దేరి ఎక్కడ కలుసుకున్నారు? .. ఆ జర్నీ అంతా ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేది కథ. అని తెలిపారు సుమంత్.. అలాగే కథ చెప్పింది  కరోనా ముందు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో అనుకున్నాం. అప్పుడే వ్యూహాన్ లో స్టార్ట్ అయ్యాం. సెకండ్ షెడ్యూల్ టైంలో కరోనా వల్ల లాక్ అయ్యాం అన్నారు.

తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ చూపించడం వల్ల అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. కథలో రోల్స్ ఇన్వాల్మెంట్ ఉండాలి. ఇందులో అవన్నీ ఉన్నాయి. కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అందరికీ ఫ్లష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవీ లేవు కానీ శ్రీకాంత్ గారికి ఉంది. లాస్ట్ లో 20 మినిట్స్ స్నో మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు. బైక్ నన్ను మాదాపూర్ నడపమంటే నడిపేస్తా. కానీ స్నో మీద చాలా రిస్క్. అందుకే స్నో మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. లక్కీగా ఎవ్వరికీ ఏమీ యాక్సిడెంట్ లాంటివి జరగలేదు అన్నారు సుమంత్ అశ్విన్.

భూమిక గారు కూడా చాలా డేర్ చేశారు. డూప్స్ పెట్టి చేయొచ్చు. కానీ రియలిస్టిక్ గా ఉండేందుకు ఆమెనే చేశారు. ఒక్కడు తర్వాత ఆవిడతో డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే. నా చిన్న తనంలో ఫిలిం చాంబర్ లో భూమికను చూసి భలే ఉంది హీరోయిన్ అనుకున్నా. ఆవిడతో ఒక్కడు సెట్ లో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆవిడతో నేరుగా యాక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇది ఎక్సలెంట్ ఫీలింగ్ అన్నారు సుమంత్.

ఈ సినిమాలో ఒక్క సీన్ లో భూమిక గారు నా బైక్ ఎక్కుతారు. ఆ సీన్ షూట్ చేసినప్పుడు గానీ, మళ్ళీ చూసినప్పుడు గానీ గూస్ బంప్స్ వచ్చాయి. అక్క అనే రిలేషన్ ఉంటుంది. నాకు తాన్యా హాప్ కి లవ్ ట్రాక్ నాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ గురు మంచి రైటర్. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే మాకు ఈజీ కావాలని ఆయనే స్వయంగా తిరిగి టెస్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. అది డైరెక్టర్ కి డెఫినెట్ గా ఉండాలి. ఆయనకు ఏ బైక్ ఎంత సీసీ ఉంటుంది. గేర్ల పట్ల చాలా అవగాహన ఉంది. గురు మైండ్ లో పక్కా కమర్షిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని నాచురల్ గా మలిచి సినిమా రూపొందించారు.

అంతకుముందు ఆ తర్వాత, లవర్స్ లాంటి సినిమాలు చేశా. ప్రతి ప్రాజెక్టు నుంచి ఓ అనుభవం వచ్చింది. నా సినీ జర్నీలో చాలా నేర్చుకున్నా. నేను చాలా హ్యాపీ. కారులో కంటే బైక్ లో వెళితే ఆ కిక్కే వేరు. మైనస్ డిగ్రీస్ లో చాలా సన్నివేశాలు షూట్ చేశాం. బైక్ అనేది రియల్లీ ఫన్. అందుకే చాలా మంది రైడర్స్ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. నా తదుపరి సినిమా 7 డేస్ 6 నైట్స్ షూటింగ్ కూడా పూర్తయిందని అన్నారు సుమంత్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telugu Anchor: ఈ ఫోటోలో ఉన్న తెలుగు యాంకర్ ఎవరో గుర్తించారా..?.. మస్త్ యాక్టివ్

Bigg Boss 5 Telugu: చిక్కుల్లో చిక్కుకోకు అంటూనే చిక్కుల్లోకి నెట్టాడు.. బరువు తగ్గినవారే కెప్టెన్సీకి అర్హులు..

Heroine Sayyeshaa New Photos: నెట్టింట్లో అఖిల్ హీరోయిన్ హల్‏చల్.. లేటెస్ట్ ఫోటోలతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ సాయేషా..