తమిళ స్టార్ నటుడు సూర్య కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే సూర్య ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు సూర్య. ఆయన నటించిన ‘జై భీమ్’ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆస్కార్‌కి ఎంపికైంది. ఇప్పుడు సూర్య నటించిన ‘కంగువ’ సినిమా విడుదలకు దగ్గర్లో ఉంది. పాన్ ఇండియా సినిమా కంగువ ప్రమోషన్లో సూర్య బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఓ తమిళ స్టార్ డైరెక్టర్ పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నటుడిని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరు.? సూర్య ఫాన్స్ ఎందుకు అతని పై ఫైర్ అవుతున్నారు.?
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘లియో’, ‘విక్రమ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ సూర్యతో ఫుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. సూర్యకు లోకేష్ రెండు కథలు చెప్పాడట. అందులో ఒకటి సూపర్ హీరో కథ. చేయి కోల్పోయిన ఓ వ్యక్తి కథ ఇది. ఈ చిత్రానికి ‘ఇరుంబు కై మాయావి’ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఈ సినిమా వస్తుందో లేదో తెలియదు. అయితే ఇప్పుడు ఇదే సినిమాను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో చేస్తున్నారని తెలుస్తోంది. అమీర్ ఖాన్ కోసం లోకేష్ కనగరాజ్ ‘ఇరుంబు కై మాయావి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
తాజాగా అనుపమ చోప్రాతో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడిన లోకేష్ కనగరాజ్.. అమీర్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ‘కంగువ’ను ప్రమోట్ చేస్తున్న సూర్య కూడా అదే సమయంలో ‘ఇరుంబు కై మాయావి’ నేను చేయాలనుకున్నాను. కానీ అది వేరే పెద్ద హీరో చేస్తున్నారు అని చెప్పాడు. అలాగే ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రను ప్రధానాంశంగా పెట్టుకుని ఓ సెపరేట్ మూవీ చేయనున్నట్టు సూర్యతో లోకేష్ కనగరాజ్ చెప్పాడు. దీనికి సంబంధించి ఒక లైనర్ మాత్రమే ఉంది. స్క్రీన్ ప్లే ఇంకా సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కార్తీతో పాటు లోకేశ్ కూడా ‘ఖైదీ 2’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రోలెక్స్ మెయిన్ విలన్‌గా కనిపిస్తాడని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాలన్నీ ఎప్పుడు మొదలవుతాయి అన్నది మాత్రం తెలియడం లేదు. దాంతో లోకేష్ పై సూర్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న విడుదలవుతోంది. దిశా పటానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.