
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ ఆయన పరశురామ్ దర్శకత్వంలో మూవీ చెయ్యడానికి కమిటైన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వెల్లడించనుంది మూవీ యూనిట్. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. టైటిల్ కూడా రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే పేరు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల చక్కదిద్దుకున్న అనంతంర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మహేశ్.. కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.