Srinidhi Shetty: అలా అయితే ఈ పాటికే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీనిధి శెట్టి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Srinidhi Shetty: అలా అయితే ఈ పాటికే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty

Updated on: Oct 28, 2026 | 9:55 AM

‘ KGF ‘ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. రవి బస్రూర్ పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా పేరు పొందాడు. అలా కేజీఎఫ్ సినిమాలో పనిచేసిన చాలా మంది ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. అయితే ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీనిధి శెట్టికి ‘KGF’ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ‘KGF’ తర్వాత శ్రీనిధి శెట్టి భారీ పారితోషికం డిమాండ్ చేసిందని, అందుకే ఆమెకు అవకాశాలు రాలేదని రూమర్లు వినిపించాయి. తాజాగా ఇదే విషయం గురించి శ్రీనిధి శెట్టి స్వయంగా మాట్లాడింది. విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆమె నటించిన ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన శ్రీనిధి ‘KGF’ తర్వాత తన పారితోషికం గురించి వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

‘నేను కేవలం డబ్బు కోసమే సినిమాలకు సంతకాలు చేయను. ‘KGF’ విజయం తర్వాత, నేను 7 నుంచి 8 కోట్లు పారితోషికం అడిగానని రూమర్లు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పటివరకు చాలా తక్కువ చిత్రాలలో నటించాను. అలాంటప్పుడు, నేను అంత భారీ పారితోషికాన్ని ఎలా అడగగలను? నా ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించడమే అయితే, గత కొన్నేళ్లలో నేను 30 నుంచి 40 చిత్రాలలో నటించి ఉండేదాన్ని. కానీ నేను కేవలం డబ్బు కోసం చిత్రాలకు సంతకం చేయను. నేను మంచి కథలకు, నాణ్యమైన పాత్రలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను’ అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

బర్త్ డే వేడుకల్లో శ్రీనిధి శెట్టి..

 

‘KGF’, ‘KGF 2’ తర్వాత శ్రీనిధి ‘కోబ్రా’, ‘హిట్ 3’, ‘తెలుసు కదా’ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటిలో హిట్ 3 సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి ‘ఆదర్శ కుటుంబం ‘ చిత్రంలో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. వీరితో పాటు నివేదా పేతురాజ్, డింపుల్ హయతీ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us