Sonali Bendre: 51 ఏళ్ల వయసులో 20 గంటలు ఉపవాసం.. ఇదే నా డైట్ సీక్రెట్.. సోనాలి బింద్రే కామెంట్స్..

పాన్ ఇండియా లెవల్లో విపరతీమైన క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.

Sonali Bendre: 51 ఏళ్ల వయసులో 20 గంటలు ఉపవాసం.. ఇదే నా డైట్ సీక్రెట్.. సోనాలి బింద్రే కామెంట్స్..
Sonali Bendre

Updated on: Jul 15, 2026 | 8:34 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ సోనాలి బింద్రే. మెగాస్టార్ చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సోనాలి బింద్రే.. ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీలో పలు సినిమాలు, రియాల్టీ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా.. 51 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోనాలి అందం, ఫిట్‌నెస్ ఇప్పటికీ యువ నటీమణులను సైతం మించిపోతాయి. అందమైన ముఖం, నాజూకైన శరీరం కోసం సోనాలి తన ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆమె రోజులో సగానికి పైగా ఆకలితో ఉంటారు. ఆమె మితంగానే తింటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, సోనాలి తన ఆహారం , ఫిట్‌నెస్ దినచర్య గురించి వెల్లడించారు. తాను ప్రతిరోజూ 18 నుండి 20 గంటల పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తానని సోనాలి చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

సోనాలి రోజంతా ఏమీ తినకుండానే గడిపేస్తుంది. ఆమె భోజన సమయాలు నిర్ణయించబడి ఉంటాయి. ఆమె రోజుకు ఒకటిన్నర సార్లు లేదా కొన్నిసార్లు రెండుసార్లు మాత్రమే తింటుంది. చాలా వరకు, ఆమె దినచర్య ఇలాగే ఉంటుంది. ఆమె తాను తినే ఆహారం పరిమాణం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె తన ప్లేటులో తనకు అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. చాలా మందికి భోజనాల మధ్యలో చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. కానీ సోనాలి వీటన్నింటికి దూరంగా ఉంటుంది. ఆమె తక్కువగా తింటుంది, కానీ ఆలోచించి, సమతుల్యంగా తింటుంది. “ఇదే నాకు ఉత్తమమైనది,” అని ఆమె చెప్పింది. మధ్యంతర ఉపవాసం ఏమి తినాలి అనే దానికంటే ఎప్పుడు తినాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

మధ్యంతర ఉపవాసంలో తినడానికి , ఉపవాసం ఉండటానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఇది ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి , బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. సోనాలి బింద్రే ఇంకా ఇలా అన్నారు, “ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. అందువల్ల, మీరు మీ శరీరానికి , జీవనశైలికి సరిపోయే ఆహారాన్ని అనుసరించాలి. అని అన్నరు. 2018లో, ఆమెకు నాలుగో దశ మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. న్యూయార్క్‌లో సుదీర్ఘ చికిత్స , కీమోథెరపీ తర్వాత, ఆమె క్యాన్సర్‌ను విజయవంతంగా జయించారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

సోనాలి బింద్రే పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us