Tollywood: టాలీవుడ్‌కు కొత్త గ్లామర్.. వారసుల టైమ్ షురూ..!

సినిమా అంటే వారసులకు అద్భుతమైన వేదిక. అందమైన అవకాశాన్ని వినియోగించుకుంటే..వాళ్లందరూ అందలానికి ఎక్కడం ఎంతో తేలిక. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో వెలుగుతున్నారు కొందరు నటులు తండ్రులు వేసిన బాటలో నడుస్తూ, వారిని తలెత్తుకునేలా చేస్తున్నారు..! భవిష్యత్తుల్లో వీరి పేరును నిలబెట్టడానికి... నవ వారసులు సిద్ధమేనా?

Tollywood: టాలీవుడ్‌కు కొత్త గ్లామర్.. వారసుల టైమ్ షురూ..!

Edited By: Ravi Panangapalli

Updated on: Aug 27, 2024 | 3:26 PM

సినిమా అంటే వారసులకు అద్భుతమైన వేదిక. అందమైన అవకాశాన్ని వినియోగించుకుంటే..వాళ్లందరూ అందలానికి ఎక్కడం ఎంతో తేలిక. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో వెలుగుతున్నారు కొందరు నటులు తండ్రులు వేసిన బాటలో నడుస్తూ, వారిని తలెత్తుకునేలా చేస్తున్నారు..! భవిష్యత్తుల్లో వీరి పేరును నిలబెట్టడానికి… నవ వారసులు సిద్ధమేనా? ఇంటిపేరును నిలబెట్టి, సొంతంగా ఐడెంటిటీ క్రియేట్‌ చేసుకోవడానికి వారు తయారుగున్నారా? వందేళ్ల సినిమా చరిత్రను ఘనకీర్తితో ముందుకు సాగించగల సత్తా వాళ్లలో ఉందా? ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ… అంటూ  రంగంలోకి దిగడానికి రెడీ అంటున్నారు వారసులు. వాళ్లకున్న సత్తా ఏంటి? వాళ్ల మీదున్న బరువు బాధ్యతలు ఎలాంటివి? అభిమానులు ఇష్టంగా మాట్లాడుకునే ట్రెండింగ్‌ టాపిక్‌ ఇది. అకీరా… డిప్యూటీ సీఎం తాలూకు! మెగా ఫ్యామిలీ నుంచి వారసుడు సిద్ధమవుతున్నాడు… జూనియర్‌ పవర్ స్టార్‌, పవర్‌ ప్రిన్స్  అకీరాని దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాసుకుంటే బాక్సాఫీస్‌ దగ్గర భలేగా వర్కవుట్‌ అవుతాయనే మాట గట్టిగానే వినిపిస్తోంది సినిమా పరిశ్రమలో. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేళ… ఆ గెలుపు గురించి ఎందరు మాట్లాడుకున్నారో, పవర్‌స్టార్‌ వెంట నడిచిన తనయుడు అకీరా నందన్‌ గురించి కూడా అంతేమంది మాట్లాడుకున్నారు. Akira Nandan పవర్‌స్టార్‌ వారసుడు సిద్ధమవుతున్నాడు. అద్భుతమైన కథలు అల్లుకుంటే, కుర్రాడు భలేగా సెట్‌ అవుతాడనే మాటలు మళ్లీ మళ్లీ వినిపించాయి....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి