ఇటీవలే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సింగర్ సునీత… తన ప్రొఫిషనల్ లైఫ్‌లో మరో టర్న్ తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవల బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న ఈమె.. త్వరలో ఆయనతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాంగో సంస్థల అధినేత రామ్.. ‘ఏక్‌మినీ కథ’ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన బాధ్యతల్ని సునీత స్వయంగా పర్యవేక్షించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సునీత తన మధురమైన గాత్రంతో తెలుగులో ఎన్నో హిట్‌పాటలు పాడి శ్రోతల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. ప్లేబ్యాక్ సింగర్‌గానే కాకుండానే యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనలోని టాలెంట్ చూపించారు. సౌందర్య నుంచి మొదలుపెడితే ప్రముఖ హీరోయిన్స్ స్నేహ, ఇలియానా, త్రిష, సోనాలి బింద్రే, కమలినీ ముఖర్జీ, జెనీలియా, ఇలియానా, త్రిష, కత్రినా కైఫ్‌లాంటి ఎందరో స్టార్ హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పారు.
కాగా కాలేజీలో చదివే రోజుల్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఆలోచన వచ్చినట్లు గాయని సునీత ఇటీవల తెలిపారు. గుంటూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలామంది కుర్రాళ్లు ఫాలో అయ్యేవారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే పాఠశాల చదువుల నుంచే సంగీతంతో పాటు ఖాళీ సమయాల్లో కాంపిటీషన్లుకు సిద్ధం చేయడం తప్ప, అల్లరి చేసే అవకాశం తన పేరెంట్స్ ఇవ్వలేదని చెప్పారు. ‘గులాబీ’ సినిమాలో ‘ఈ వేళలో నీవు సాంగ్‌తో సునీత చిత్రాలకు పాటలు పాడటం ప్రారంభించింది.
Also Read: డొంకకు పెట్టిన మంట పెళ్లి ఇంటికి చేరింది.. చివరకు బుగ్గే మిగిలింది