Singer Sunita-Ram: సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి, గుర్తించి ధైర్యంగా ముందడుగు వేశారు. ఇప్పుడు ఈ జంట ఆదర్శంగా నిలిచింది. టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత, పారిశ్రామిక వేత్త రామ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్న సునీత.. తన భర్తతో పెళ్లి జరిగిన సందర్భం గురించి.. తన భర్త ఆలోచనా తీరు, వ్యక్తిత్వం గురించి టీవీ9 తెలుగుతో ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రామ్ అనేవాడు ఒక మంచి మనిషి..నమ్మదగిన వ్యక్తి. ఇది నా ఒక్కరి ఫీలింగ్ మాత్రమే కాదు.. అతను ఒక మంచి వ్యాపారి.. నేను తిన్న దెబ్బలకు అసలు మనిషిని నమ్మడం మానేశాను.. అయితే మా పెళ్లి ప్రస్తావన వచ్చిన తర్వాత నాకు రామ్‌లోని హానెస్టీ నచ్చింది. రామ్‌తో పెళ్లి నా జీవితంలో హఠాత్తుగా వచ్చిన ఆనందం. ఒక నెలలో నిశ్చితార్ధం పెళ్లి.. జరిగిపోయాయి. అంతే నా జీవితంలోకి ఆనందం వచ్చింది. నువ్వు లేకపోతె చచ్చిపోతా అన్న వారిని చూశా.. రామ్‌ని చూశా అని సింగర్ సునీతా చెప్పారు. నా జీవితంలో నేను పెరిగిన వాతావరణానికి .. నా కుటుంబ నేపథ్యానికి మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత మంగళసూత్రం అలాగే చాలా ఏళ్ళు ఉంది. నేను కెరీర్లో కంటిన్యూ కావడం కోసం నేను ఆ వ్యక్తిని వదులుకోలేదు.. నా పిల్లలు గురించి మాత్రమే ఆలోచించా.. వారి బాల్యం సంతోషంగా గడపాలని కోరుకున్నా. ఇప్పుడు వాళ్లే నా కంటే నా పెళ్లి గురించి ఆలోచించారు.
నా కూతురు కొడుకు విదేశాలకు వెళ్ళిపోవాలి చదువుకోవాలి.. అప్పుడే వారు చెప్పారు.. ఎంతకాలం ఇలా ఉంటావు.. అమ్మమ్మ వాళ్ళు జీవితాంతం నీకు తోడుగా ఉండరు.. అందుకనే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేవారు .. తనకు పెళ్లి, పిల్లలు, వివాహం, కుటుంబ విలువ అంటే చాలా ఇష్టం అని చెప్పారు సునీత. ఇంత ఓపెన్ గా నా భర్త గురించి చెప్పుకోవడం అంటే ఇష్టం. రామ్ తన కుటుంబ మీద ఆధారపడకుండా తనంతట తానూ కష్టపడి.. ఒక సంస్థను సృషించుకున్నాడు. తనకు నాకు ఉన్న కామన్ క్వాలిటీ ఏమిటంటే మేము ఇద్దరం పని రాక్షసులం .. తనకు మంచి కమిట్మెంట్ ఉంది.. అంటూ భర్త పై ప్రశంసల వర్షం కురిపించింది సునీత.
Also Read: Singer Sunita: నా పెళ్లి కొందరికి ఇష్టంలేదు.. తడిగుడ్డలతో గొంతుకోసే రకాలను చూశా.. సింగర్ సునీత..