Singer Sid Sriram: ‘సామజవరగమన’ గాయకుడు సిద్ శ్రీరామ్‏కు అవమానం.. ఒంటిపై మద్యం, వాటర్ పోసి..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల.. వైకుంఠపురం' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం

Singer Sid Sriram: సామజవరగమన గాయకుడు సిద్ శ్రీరామ్‏కు అవమానం.. ఒంటిపై మద్యం, వాటర్ పోసి..

Updated on: Mar 09, 2021 | 12:21 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురం’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం సినిమానే కాకుండా… అందులో సాంగ్స్ కూడా ఓ రేంజ్‏లో హిట్టయ్యాయి. మరీ ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట విపరీతంగా ఆకట్టుంది. ఇక ఆ సాంగ్ పాడిన సిద్ శ్రీరాం కూడా ఎంతగానో ఫాలోయింగ్ దక్కింది. ఈ మూవీ తర్వాత ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే పవన్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలో ‘మగువా, మగువా’ అనే సాంగ్, ‘శశి’ సినిమాలో ‘ఓకే ఒక లోకం’ పాటలు ఫుల్ పాపులర్ అయ్యాయి. ఇదిలా ఉండగా సిద్ శ్రీరాంకు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10సి‌లో ఉన్న సన్‌బర్న్‌ సూపర్‌క్లబ్‌లో సిద్ శ్రీరాం‌మ్‌కు అవమానం జరిగినట్టుగా సమాచారం. ఆదివారం రాత్రి పబ్‏లో జరిగిన మ్యూజికల్ కాన్సెర్ట్ కు హజరైన కొందరు ఆకతాయి యువకులు సిద్ శ్రీరాంపై నీళ్ళు, మద్యం విసిరి అవమానించినట్టు సమాచారం. దీంతో ఆవేశానికి గురైన సిద్ శ్రీరాం ఆకతాయిలను గెట్ అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చారట. మాట మాట పెరిగే ఆ విషయం పెద్దగా అవుతన్న క్రమంలో పబ్ యాజమాన్యం కల్పించుకోని గొడవను ఆపినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ సిద్ శ్రీరాంతోపాటు మరికొంతమంది సెలబ్రెటీలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పబ్ యాజమాన్యం పరిష్కరించిందని సమాచారం. కాగా, ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు సన్‌బర్న్ సూపర్‌క్లబ్‌లో సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ శ్రీరాం నితిన్, కిర్తీ సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమాలో నా కనులు ఎపుడు అనే సాంగ్ పాడారు.

Also Read:

Prema Entha Madhuram Serial: “ప్రేమ ఎంత మధురం” సీరియల్ ఫేం అను గురించి ఆసక్తికర విషయాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us