Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పాపులర్ సింగర్ హేమచంద్ర. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరించారు. చాలా కాలంగా నెట్టింట సైలెంట్ గా ఉంటున్న హేమచంద్ర.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ సంగీత ప్రయాణం, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన తండ్రి ఇచ్చిన "ముందు చెయ్, తరువాత నేర్చుకో" అనే సలహాను అనుసరిస్తూ తన మొదటి తప్పు గురించి చెప్పుకొచ్చారు.

Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
Singer Hemachandra

Updated on: Aug 11, 2026 | 11:29 AM

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సింగర్ హేమచంద్ర. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, స్వతంత్ర సంగీత కళాకారుడిగా పలు విభాగాల్లో రాణించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హేమచంద్ర మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్థానం, స్వతంత్ర సంగీతం పట్ల తన అభిరుచి, ఈ ప్రయాణంలో ఎదురైన కీలక అనుభవాలను పంచుకున్నారు. హేమచంద్ర తన కెరీర్ ఆరంభాన్ని గుర్తుచేసుకుంటూ, రియాలిటీ టెలివిజన్ నుండి ప్లేబ్యాక్ సింగింగ్‌కు మారిన విధానం, “ఫిదా”, “RRR”, “మహర్షి”, “జై లవకుశ” వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు తన గాత్రాన్ని అందించిన తీరును వివరించారు. సంగీత దర్శకుడిగా, “ధృవ”, “ఊపిరి”, “భారత్ అనే నేను” వంటి చిత్రాలకు ప్రముఖ నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అయితే, ఆయన హృదయం ఎప్పుడూ స్వతంత్ర సంగీతం పట్లనే ఉందని, తెలుగు ఇండి సంగీత రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

స్వతంత్ర సంగీతంలో సహకారం, కలిసికట్టుగా కృషి చేయడం ప్రాముఖ్యతను హేమచంద్ర చెప్పారు. అలాగే పలు పెద్ద లేబుల్స్ స్వతంత్ర పాటలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఎదుగుదల కంటే మొత్తం ఇండి సీన్ అభివృద్ధి చెందాలనే తన ఆలోచనను వెల్లడించారు. “ఒక్క ఆర్టిస్ట్ గురించి కాదు. నా లక్ష్యం నేను ఒక్కడినే పాటలు పడి ఎదగడం కాదు. తెలుగు ఇండి సీన్‌ను ఎక్కడో ఒకచోట పెరగాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను,” అని చెప్పుకొచ్చారు. ఇది కేవలం తన గురించిన ప్రయాణం కాదని, తెలుగు సంగీత రంగంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష అని ఆయన మాటల్లో స్పష్టమైంది. తన తండ్రి ఇచ్చిన ఒక అద్భుతమైన సలహాను హేమచంద్ర ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “నీకు మైండ్‌కి ఏం అనిపిస్తే, నీకు హార్ట్‌కి ఏం వస్తే, నువ్వు ముందు చేసేయ్. దాన్ని అనలైజ్ చేసి, ఆలోచించి, దీనివల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అని ఇంత చేయకు. డోంట్ క్యాలిక్యులేట్. జస్ట్ గో, ఫాలో యువర్ హార్ట్ అండ్ డు ఇట్. అయ్యాక, దాని అవుట్‌పుట్ వచ్చాక, రిజల్ట్ వచ్చాక, అప్పుడు చూడు. సక్సీడ్ అయ్యింది అనుకో, యు కెన్ డు మోర్. లేదు అనుకో, యు కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్” అని ఆయన తండ్రి చెప్పిన మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ సలహానే తన జీవితంలో చాలా తప్పులు చేయడానికి అనుమతించిందని, అయితే వాటి నుండి తాను ఎన్నో నేర్చుకున్నానని గర్వంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

తన “మొదటి తప్పు” గురించి ప్రస్తావిస్తూ, “2020లో నేను మొదటి స్వతంత్ర పాటను విడుదల చేశాను. లాక్‌డౌన్ వచ్చినా నేను నా ప్రయత్నం కొనసాగించాను. అప్పుడు ఒక లేబుల్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. లేబుల్‌ది తప్పు కాదు, నాదే తప్పు. ఎందుకంటే నాకు బిజినెస్ తెలవదు.” అని అన్నారు. వ్యాపార జ్ఞానం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఎలా అనూహ్య పరిణామాలకు దారితీశాయో ఈ సంఘటన ద్వారా వివరించారు. ఈ అనుభవాలు తనను మరింత దృఢంగా, నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవడానికి సహాయపడ్డాయని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Loading...
Unable to load recommendations.
Follow Us