Singer Chitra : ఆ పాట వల్లనే తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది.. ఎప్పటికీ మర్చిపోలేను.. సింగర్ చిత్ర..

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిచుకున్న సింగర్ చిత్ర. శ్రోతలు ఎంతో అభిమానంగా ‘గానకోకిల’, ‘సంగీత సరస్వతి’ అని పిలుచుకుంటారు. నాలుగు దశాబ్దాలుగా తన అమృత గాత్రంతో దక్షిణాది సినీ సంగీత ప్రపంచాన్ని, ముఖ్యంగా టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపారు. మలయాళీ అయినప్పటికీ, స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ఆమె పాడిన వేలాది పాటలు తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.

Singer Chitra : ఆ పాట వల్లనే తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది.. ఎప్పటికీ మర్చిపోలేను.. సింగర్ చిత్ర..
Singer Chitra

Updated on: Jun 01, 2026 | 9:19 AM

దక్షిణాది సినీ ప్రియులకు సింగర్ చిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనదైన ముద్ర వేసింది. టాలీవుడ్‌లో ఆమెకు, ఆమె పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని దశాబ్దాలుగా వేలాది అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరిస్తున్న చిత్ర.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సంగీత ప్రయాణం, కెరీర్‌లో అందుకున్న అత్యుత్తమ ప్రశంసలు, బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గీతాంజలి’ తెచ్చిపెట్టిన విజయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకుల నుంచి అందుకున్న అత్యుత్తమ కాంప్లిమెంట్ (ప్రశంస) ఏంటని అడగ్గా, చిత్ర ఎంతో వినమ్రంగా సమాధానమిచ్చారు. సాధారణంగా అందరూ బాగా పాడతారని చెప్తారని, కానీ తన మనసుకు బాగా నచ్చిన, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస మాత్రం ఒకటేనని అన్నారు. నాన్‌-తెలుగు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తాను పాడే తెలుగు పాటలు వింటుంటే, ఒక ‘తెలుగు అమ్మాయి’ పాడుతున్నట్లే ఉంటుందని ప్రేక్షకులు చెప్పడం తనకు లభించిన అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

ఇదే ఇంటర్వ్యూలో మణిరత్నం-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘గీతాంజలి’ సినిమా ప్రాముఖ్యతను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇళయరాజా సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా తర్వాతే చిత్రకు తెలుగులో అవకాశాల వెల్లువ కురిసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో, మెలోడీల నుంచి ఊరమాస్ సాంగ్స్ వరకు అన్ని రకాల పాటలు పాడే అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఈ సందర్భంగా ‘గీతాంజలి’ చిత్రంలోని ఎవర్గ్రీన్ మెలోడీ సాంగ్ అయిన “ఓ ప్రియా ప్రియా..” పాటను గుర్తు చేసుకున్నారు. ఇళయరాజా కంపోజిషన్‌లో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన ఈ పాట ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ మెలోడీగా నిలిచిపోయింది. ఒక మలయాళీ కుటుంబంలో పుట్టినా, తెలుగు భాషపై పట్టు సాధించి కోట్లాది మంది హృదయాల్లో ‘తెలుగు కోకిల’గా స్థానం సంపాదించుకోవడం చిత్రకు మాత్రమే సాధ్యమైంది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఓ ప్రియా ప్రియా సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

Follow Us