
సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మరికొందరు మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఈ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. స్టార్ హీరో కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. మరోవైపు తన గాత్రంతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వివాహం, తల్లి కావాలనే కోరికపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు అందాల భామ శ్రుతిహాసన్.
బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తల్లి కావాలంటే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందేనా.? అనే ప్రశ్నపై శ్రుతిహాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తల్లిగా మారేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది.? తల్లి కావాలంటే వివాహం తప్పనిసరా అనే ప్రశ్న నాలో మొదలవుతోంది. ప్రస్తుతం తల్లి కావడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో నా జీవన విధానంలో భాగంగా సహజంగా కూడా తల్లి కావాలని కోరుకుంటున్నాను” అని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే పెళ్లి వ్యవస్థకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది శ్రుతిహాసన్. తన పెళ్లిపై వస్తున్న చర్చలకు కూడా ఈ స్టార్ హీరోయిన్ స్పందించింది. తన వయసు 40కి చేరువవుతున్నప్పటికీ తాను ఇంకా సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. అయితే తన జీవితంలో సరైన భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది శ్రుతి. “నాకు వివాహ వ్యవస్థపై వ్యతిరేకత లేదు. నా జీవితంలో నాకు తోడుగా ఉండే భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడూ ఒకే చోట ఇమిడిపోయే వ్యక్తిని కాదు. నా జీవితాన్ని నా ఇష్టప్రకారం జీవించాలని కోరుకుంటాను. కొన్ని విషయాల్లో నేను సంప్రదాయబద్ధంగా ఉంటాను. మరికొన్ని విషయాల్లో పాత పద్ధతులను పాటిస్తాను. అయితే అవన్నీ నా ఇష్టంతోనే చేస్తాను. ఎవరూ నాపై బలవంతం చేయరు” అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.