శర్వానంద్, సమంతల లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

శర్వానంద్ హీరోగా, సమంత హీరోయిన్‌గా వీరి కాంబినేషన్‌లో ’96’ ప్రేమకథా చిత్రం రాబోతోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ సినిమా ’96’లో త్రిష, విజయ్ సేతుపతి జంటగా కలిసి నటించారు. ఈ సినిమా అక్కడ సూపర్‌ హిట్‌ను అందుకుంది. దీంతో.. ఆ సినిమాకు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా.. ఈ సినిమా విడుదల […]

శర్వానంద్, సమంతల లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 12:25 PM

శర్వానంద్ హీరోగా, సమంత హీరోయిన్‌గా వీరి కాంబినేషన్‌లో ’96’ ప్రేమకథా చిత్రం రాబోతోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ సినిమా ’96’లో త్రిష, విజయ్ సేతుపతి జంటగా కలిసి నటించారు. ఈ సినిమా అక్కడ సూపర్‌ హిట్‌ను అందుకుంది. దీంతో.. ఆ సినిమాకు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా.. ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త షికారు చేస్తోంది. ప్రేమకథా చిత్రం కాబట్టి దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14th వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఆ రోజున ప్రేమికుల రోజు కాబట్టి.. ఫ్యాన్స్‌ను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుందని వారు భావిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

కాగా.. ఈ సినిమా గురించి.. అక్కినేని సమంత ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నన్ను సవాలు చేసే ఈ పాత్రలో.. నిన్నటి కంటే ఉత్తమంగా మరో ప్రత్యేకమైన పాత్రలో నటించా. రోజూ మ్యాజిక్ క్రియేట్ చేసే చిత్ర బృందంతో కలిసి పనిచేయడం నాకు సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. శర్వానంద్, ప్రేమ్ కుమార్‌కు థ్యాంక్యూ సో మచ్. ఈ రోల్‌కి నన్ను ప్రిఫర్ చేసినందుకు.. అని పోస్ట్‌ చేస్తూ.. భావోద్వేగానికి గురైన ఓ ఫొటోను ట్వీట్ చేసింది సామ్.

Latest Articles