Actress Raasi: ఆ స్టార్ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. అతని సినిమాలు చూడడానికి మాత్రమే థియేటర్లకు వెళతా

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది రాశి. టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆమె సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తోన్న ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Actress Raasi: ఆ స్టార్ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. అతని సినిమాలు చూడడానికి మాత్రమే థియేటర్లకు వెళతా
Actress Raasi

Updated on: Mar 25, 2026 | 9:38 AM

తెలుగు సినిమా ఆడియెన్స్ కు హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో కలిసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, గిల్లి కజ్జాలు, ప్రేయసి రావే, పోస్ట్ మ్యాన్, అమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి, శ్రీరామ చంద్రులు తదితర సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది రాశి. ఇక రవితేజ వెంకీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన ఈ అందాల తార మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేసి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాల నుంచి విరామం తీసుకుంది రాశి. చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో సహాయక నటిగా చేస్తోన్న రాశి గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

‘ప్రభాస్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ప్రభాస్‌తో కలిసి ఒక్కసినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏళ్లుగా ఉండిపోయింది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితిల్లో ఛాన్స్‌ వచ్చినా ప్రభాస్ కు తల్లిగా మాత్రం నటించను. అలాగే అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయను. హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ ఎలాగూ ఇవ్వరనుకోండి (నవ్వుతూ). ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని నా బ్రదర్‌తో చెప్పాను. నేను ప్రభాస్‌ సినిమాలు చూడటానికి మాత్రమే థియేటర్‌కి వెళ్తాను. ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 థియేటర్లలోనే చూశాను. అలాగే ప్రభాస్ నటించిన మిర్చి, రాధేశ్యామ్‌ వంటి చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పాను.’

ఇవి కూడా చదవండి

‘దురదృష్టం కొద్దీ ప్రభాస్‌ను ఇంతవరకు కలవలేకపోయాను. దీంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. అడవి రాముడు షూటింగ్ సమయంలో ప్రభాస్‌ ఉన్న హోటల్‌లోనే నేను కూడా ఉన్నాను. ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశాను. అయితే ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా.. అప్పుడు కుదరలేదు. ఆయన ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడాను. ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నాను’ అని రాశి చెప్పుకొచ్చింది.

వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us