
యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. టెక్నికల్లీ ఈ చిత్రం ఎంతో క్వాలిటీగా ఉందనిపిస్తోంది. ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
కమల్ కామరాజ్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ లాంటి చిత్రాన్ని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం. కథకు ప్రాధాన్యమున్న చిత్రమిది. ఓ అమ్మాయి, వారి భావోద్వేగాలను చూపించే సినిమా. కలలు కంటే సాకారం అవుతాయా? లేదా? అన్నది మనకు తెలీదు. కానీ పెద్ద కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని చెప్పే గొప్ప సందేశంతో ఈ మూవీని తీశారు. అందరికీ స్పూర్తినిచ్చే చిత్రం. కథ విన్నప్పుడే అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకున్నాను’ అని అన్నారు.
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ .. ‘శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భాగ్యరాజా గారు నన్ను నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చారు. సౌమిత్ గారు అద్భుతంగా నటించారు. ఆకాశ్, అంజలికి ఆల్ ది బెస్ట్. నవంబర్ 20న ఈ చిత్రం రాబోతోంది. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. అందరూ చూడండి’ అని అన్నారు. శ్రేయసి సేన్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో అందమైన ప్రేమ కథ ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఇన్ స్పైర్ చేసేలా మూవీ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
సౌమిత్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు అందరి పాత్రలతో ప్రయాణం చేస్తారు. మా సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఆ విజయంలో మార్తాండ్ గారికి కూడా షేర్ ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి థాంక్స్’ అని అన్నారు. గీతా భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంత గొప్ప సినిమాని తీసినందుకు కార్తీక్‌కి థాంక్స్. శేఖర్ కమ్ముల గారి వల్లే నాకు ఐడెంటిటీ వచ్చింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ చూడండి’ అని అన్నారు. లిరిసిస్ట్ గడ్డం వీరు మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ .. ‘శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి గారి స్టైల్లో ఈ సినిమా ఉంటుంది. నాకు నచ్చి ఈ చిత్రం చేశాను. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ .. ‘‘‘డియర్ ఆస్ట్రోనాట్’ మూవీని ఆల్రెడీ చూశాను. కార్తీక్ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం అతను ప్రాణం పెట్టాడు. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. కృష్ణవేణి మాట్లాడుతూ .. ‘‘కార్తీక్ భాగ్యరాజ్ గారు, ఎడిటర్ మార్తాండ్ గారి వల్లే ఈ సినిమాకి ప్రాణం పోశారు. కమల్ గారు, గీతా భాస్కర్ గారు, ఆకాష్, అంజలి అద్భుతంగా నటించారు’ అని అన్నారు. కెమెరామెన్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చే చిత్రం’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మేఘన మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాకి ఎడిటర్ గారు మార్తాండ్ అని చెప్పడంతో అంతా షాక్ అయ్యేవారు. ఆయన వల్లే ఈ మూవీకి ఇంత మంచి పేరు వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి థాంక్స్’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.