Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?

|

Jun 18, 2021 | 6:11 AM

Shekhar Kammula: క‌థ‌లో కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేద‌ని చాటి చెప్పింది బాహుబ‌లి చిత్రం. ఈ సినిమా అన్ని గీత‌ల‌ను చెరిపేసి తెలుగు సినిమా మార్కెట్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లో ఈ సినిమా...

Shekhar Kammula: పాన్ ఇండియా ద‌ర్శ‌కుల జాబితాలోకి శేఖ‌ర్ క‌మ్ముల‌.. ధ‌నుష్‌తో చేతులు క‌ల‌ప‌నున్నాడా..?
Shekarkammula New Movie
Follow us on

Shekhar Kammula: క‌థ‌లో కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేద‌ని చాటి చెప్పింది బాహుబ‌లి చిత్రం. ఈ సినిమా అన్ని గీత‌ల‌ను చెరిపేసి తెలుగు సినిమా మార్కెట్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది. దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లో ఈ సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు పాన్ ఇండియా నేప‌థ్యంలో తెరకెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భాస్ న‌టిస్తోన్న అన్ని సినిమాలు దేశంలోని ఇతర భాష‌ల్లో విడుద‌లవుతుండ‌గా.. అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి చేరాడు.
ఇక తాజాగా మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కూడా పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సుబుల్ సినిమాల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న శేఖ‌ర్ తాజాగా త‌మిళ హీరో ధ‌నుష్‌తో ఓ సినిమాను తెర‌కెక్కించే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ల‌వ్‌స్టోరీ సినిమాతో బిజీగా ఉన్న శేఖ‌ర్ క‌మ్ముల.. ఈ సినిమా పూర్తికాగానే ధ‌నుష్‌తో చిత్రం మొద‌లుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త‌కు సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.

Also Read: Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..

Rock Star Yash: మరో భారీ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్.. నార్తాన్ డైరెక్షన్‏లో రాక్ స్టార్..

Mahesh Babu: మహేష్ బాబు తనయుడి రికార్డ్.. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం.. నమ్రత ట్వీట్..