కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తోన్న సినిమా లియో. మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీ కోసం తమిళంతోపాటు.. తెలుగు ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకుంటుండగా.. అటు గతంలో విడుదలైన గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఈరోజు (జూలై 29న) సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో సంజయ్ దత్.. ఆంటోని దాస్‌గా కనిపించనున్నారు. ఆంటోని లుక్ రివీల్ చేస్తూ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ స్పెషల్ వీడియోల్ షేర్ చేశారు. అందులో సంజయ్ చాలా స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నారు. సిగరేట్ తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ సలామ్ చేస్తున్నట్లుగా ఆంటోని లుక్ కనిపిస్తోన్న సమయంలో వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్ సర్జా, ప్రియాఆనంద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. సెవన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
Meet #AntonyDas 🔥🔥
A small gift from all of us to you @duttsanjay sir! It was indeed a pleasure to work with you!🤜🤛#HappyBirthdaySanjayDutt ❤️#Leo 🔥🧊 pic.twitter.com/UuonlCF3Qa— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.